flax seeds in telugu : అవిసె గింజలు (flax seeds ) మన శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవిసె గింజలు ఊబ కాయాన్ని ( అధిక బరువును ) తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి.
అవిసె గింజలను తీసుకోవటం యే కాకుండా అవిసె గింజ చెట్టు ఆకులను తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని డాక్టర్లు చెబతున్నారు. అవిసె చెట్టును ఒక్కో దగ్గర ఒక్కో పేరుతో పిలుస్తారు. అవిసె చెట్టును సంస్కృతం లో క్షుమ అనే పేరు తో పిలుస్తారు.
అవిసె చెట్టును క్షుమ అని కాకుండా అతసి అని కూడా పిలుస్తారు. హిందీ లో ఈ చెట్టును అగస్త్య వృక్షం అని కూడా అంటారు. లాటిన్ భాషలో ఈ చెట్టులో అగతి గ్రండి ఫ్లోరా సబ్సెనే అంటారు. కానీ ఈ చెట్టును తెలుగు రాష్ట్రాల్లో తెల్ల అవిసె , ఎర్ర అవిసె అని కూడా పిలుస్తారు.
అవిసె గింజలను తీసుకోవటం వలన ఉపయోగాలు : flax seeds in telugu
అవిసె చెట్టు యొక్క ఆకులను మెత్తగా రుబ్బి జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అవిసె చెట్టు యొక్క బెరడు ను కూడా పొడి చేసి నీళ్లలో కలిపి తీసుకుంటారు. ఇది ఎక్కువ వేడి చేస్తుంది. ఇలా తీసుకోవటం వలన రోజూ అధిక బరువు తో ఉన్నవారు కొద్ది రోజుల్లోనే నాజూకుగా తయారవుతారు. ఇది శరీరంలోని చెడు కొలెస్టరాల్ ని కరిగిస్తుంది.
అవిసె గింజలను పొడి చేసి లడ్డూల ల తయారు చేసి తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల అవిసె గింజలలో ఉన్న పోషక విలువలు నేరుగా శరీరానికి అందుతాయి.
మలబద్దకం తో బాధ పడేవారు అవిసె గింజలను తీసుకోవటం ద్వారా మలబద్దక సమస్య తీరుతుంది. అవిసె గింజలలో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. తద్వారా జీర్ణక్రియ సరిగా జరిగి మలబద్దక సమస్య తీరుతుంది.
అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి దీనివల్ల గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. అవిసె గింజలను రోజూ తీసుకోవడం వలన రక్త నాళాల్లో ఉండే కొవ్వును కరిగించి గుండె పదిలంగా ఉండేలా చూస్తుంది.
అవిసె గింజలు ఆంటీ క్యాన్సర్ గా కూడా పనిచేస్తాయి. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే బ్రీస్ట్ కేన్సర్ నయం అయ్యేలా చూస్తుంది.
మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది అవిసె గింజలు. అవిసె గింజలు ఏకాగ్రతను పెంచి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.
వృద్ధాప్యంలో వచ్చే మతి మరుపు వ్యాధి రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే అవిసె గింజలో చాలా పోషక విలువలు ఉన్నాయి.
వృద్ధాప్యంలో వచ్చే మతి మరుపు వ్యాధి రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే అవిసె గింజలో చాలా పోషక విలువలు ఉన్నాయి.
అవిసె గింజలను రోజూ తీసుకోవడం వలన అధిక బరువు తో బాధ పడేవారు అతి కొద్ది రోజుల్లోనే నాజూకుగా అవుతారు. ఇది బాడీలో ని చెడు కొవ్వును కరిగిస్తుంది.
అవిసె గింజలను సన్నని పొడి చేసి షాంపూ లాగా రోజూ తలకు పట్టించడం వలన జుట్టు రాలే సమస్య తగ్గిపోవడమే కాకుండా జుట్టు వోత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా చుండ్రును కూడా పోగొడ్తుంది.
రోజూ అవిసె గింజలను మెత్తగా పేస్ట్ చేసి దానికి కొంచం రోజ్ వాటర్ కలిపి మొహానికి అప్లై చేసి ఒక 15 నిమిషాల పాటు ఉంచి చల్లని నీటితో కడిగేయండి.ఇలా వారానికి ఒకరోజు చేస్తే చాలు మొహంపై ఉన్న ముడతలు పోయి చర్మం కాంతి వంతంగా తయారు అవుతుంది.
చక్కెర వ్యాధితో తో బాధపడుతున్న వారు అవిసె గింజలను తీసుకోవడం వలన రక్తం లో చక్కెర స్థాయి ని అదుపులో ఉంచుతుంది. తిప్ప తీగ కూడా చక్కెర స్థాయి ని అదుపులో ఉంచుతుంది.
కీళ్ల నొప్పులతో బాధపడే వారు అవిసె గింజలను తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య తీరుతుంది.
పూర్వం పెద్దలు అవిసె గింజలను దగ్గు, కఫం, జలుబు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులను నయం చేయడానికి వాడేవారు.
దుష్ఫలితాలు :
అవిసె గింజలు ఎక్కువ మోతదులో తీసుకోవటం వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కేన్సర్ వచ్చే అవకాశం ఉంది అని కూడా కొన్ని పరిశోధనల్లో తేలింది.అంతేకాకుండా రోజూ తీసుకోవడం వలన దీనిలో ఉండే అధిక ఫైబర్ వల్ల గస్త్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవిసె గింజల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన అంతే ప్రమాదం కూడా ఉంది.
నిల్వ ఉంచే పద్ధతి:
అవిసె గింజలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలి అంటే వాటిని పొడి చేసి డ్రై గా ఉన్నా గాజు సీసాలో పోసి ఉంచితే ఎక్కువ రోజులు పాడు అవ్వకుండా ఉంటుంది.
ఇది కూడా చదవండి : తిప్ప తీగ తీసుకోవటం వలన ఉపయోగాలు