Fenugreek seeds in telugu :
మనం రెగ్యులర్ వాడే వంట దినుసులలో మెంతులు ఒకటి. మన దేశం లో ఎక్కువగా మెంతులను ( fenugreek seeds in telugu ) వివిధ రకాల వంటకాల్లో వాడుతారు. మెంతుల పౌడర్ ని వంటకాల్లో వాడటం వల్ల వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. అంతేకాకుండా మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. మనం రోజూ ఎదో ఒక రూపం లో మెంతులను వాడుతుంటాం. మెంతులలో చాలా ఔషదగుణాలు ఉంటాయి. అందుకే మెంతులను ఆయుర్వేదిక్ ఔషద తయారీలో కూడా ఎక్కువగా వాడుతారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మెంతులు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో.
మెంతులు ముదురు పసుపు రంగులో ఉంటాయి. ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ వాసన మాత్రం ఘాటుగా ఉంటుంది. మెంతులను ( fenugreek seeds in telugu ) ఆయుర్వేదం లో మిత్రి , దీపని అని అంటారు. హిందీలో మెంతులను మెథి అని పిలుస్తారు. మెంతులు పాభేసి కుటుంబానికి చెందినది. మెంతుల యొక్క శాస్త్రీయ నామం ట్రేగోనెల్ల ఫో ఎనుం గ్రీసియం. మెంతులను సంస్కృత నామంలో బహుపర్ని అని పిలుస్తారు.
ప్రతీ ఇంట్లో పోపు డబ్బాలో కచ్చితంగా మెంతులు ఉంటాయి. మెంతులను ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద మందులు తయారీలో వాడుతున్నారు. దీంట్లో ఎన్నో రకాల వ్యాధులను తగ్గించే గుణాలు ఉన్నాయి. మెంతులను నానబెట్టి తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయి అని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా మెంతి గింజలను కాకుండా మెంతి ఆకులను కూడా రోజు వాడుతాం. మెంతి ఆకులను కూడా కూరల్లో రుచి కోసం వాడుతారు. మెంతులను సాంబార్ తయారీలో మరియు సలాడ్స్ తయారీలో కూడా వాడుతారు.
మెంతులలో పోషక విలువలు : Neutrients values in fenugreek seeds in telugu
మెంతుల్లో పొటాషియం, విటమిన్ ఎ , సి , కే, బి6 , కాల్షియమ్ , మెగ్నీషియం మరియు కాఫర్ ఉంటాయి. అంతేకాకుండా మెంతుల్లో ఫోలిక్ యాసిడ్ మరియు రిబోఫ్లావిన్ పుష్కలంగా ఉంటాయి.
మెంతుల వల్ల కలిగే ఉపయోగాలు : Health benefits of fenugreek seeds in telugu
1.మెంతులను రోజు ఉదయం పూట ఒక గ్లాస్ వాటర్ లో కలుపుకుని తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.
2.మెంతుల వాటర్ రోజు తాగడం వల్ల ఉబకాయం కూడా రాకుండా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మెంతులను తీసుకోవడం వల్ల కడుపు నిండినట్టుగా అనిపించి వేరే ఫుడ్ తినకుండా ఉంటారు. దీనివల్ల ఉబకాయం వచ్చే ఛాన్స్ తక్కువ.
3.మెంతులు చుండ్రు సమస్యకి చాలా చక్కగా పని చేస్తుంది. చాల మంది చుండ్రు సమస్య తో బాధపడుతుంటారు. అలాంటి వారికి మెంతులు చక్కటి పరిష్కారం.
4.జుట్టు త్వరగా ఊడిపోవడం మరియు జుట్టు వొత్తుగా పెరగడానికి మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మెంతుల్లో జుట్టు పెరగడానికి కావాల్సిన పోషకాలు అన్ని ఉంటాయి
5.జీర్ణ క్రియ సంబంధిత సమస్యతో బాధపడుతున్నవారు మెంతుల వాటర్ ని తీసుకోవడం వల్ల అజీర్ణము వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
6.డయాబెటీస్ వ్యాధి తో బాధపడుతున్నవారు ఈ మెంతుల వాటర్ నీ తాగితే దీంట్లో ఉండే అమైనో ఆమ్లాలు రక్తం లోని చక్కెర స్థాయి ని తగ్గిస్తుంది.
7.ఈ మధ్య ఎక్కువ మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు మెంతులను తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది.
8.మెంతులు అధిక రక్త పోటు ను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా పురుషుల్లో టెస్టోస్టెరోన్ స్థాయి ని పెంచుతుంది.