Jani master :
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఒక వివాదం లో ఇరుక్కున్నాడు. అతను ఎవరో కాదు జానీ మాస్టర్ ( jani master ). జానీ మాస్టర్ ప్రస్తుతం తను ఒక పెద్ద వివాదం లో ఇరుక్కున్నాడు. ఒక ఫిమేల్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టారు. తనని లైంగికంగా విధిస్తున్నాడని సైబరాబాద్ లో రాయదుర్గం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 21 ఏళ్ల మహిళ డ్యాన్స్ కొరిగ్రాఫర్ పై జానీ మాస్టర్ పలు సార్లు లైంగిక వేదింపులు చేశాడని, అంతేకాకుండా షూటింగ్ అయిపోయాక చాలా సార్లు ఇబ్బంధి పెట్టాడని మహిళ తన కేసు లో మెన్షన్ చేసారు. మహిళ కొరియోగ్రాఫర్ నార్సింగ్ లో నివాసం ఉంటుందని సమాచారం. కేసు నీ రాయదుర్గం నుంచి నార్సింగ్ పోలీసు స్టేషన్ కి బదిలీ చేసారని సమాచారం.
జానీ మాస్టర్ పై ఐపిసి సెక్షన్ 376 అత్యాచారం , సెక్షన్ 506 బెదిరింపు , సెక్షన్ 323 గాయపరచడం వంటి వాటిపై కేసు నీ నమోదు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి , దర్యాప్తు ప్రారంభించామని తెలంగాణ మహిళ విభాగం డిజి శిఖా గోయేల్ తెలిపారు. ఇది వరకు జానీ మాస్టర్ పై ( jani master case details ) ఇలాంటి కేసు లు ఫైల్ అయ్యాయి. అంతేకాకుండా శిక్ష కూడా తనకి పడింది.
జానీ మాస్టర్ తెలుగులో నే కాకుండా బాలీవుడ్ మరియు ఇతర ఇండస్ట్రీ లో చాలా వరకు కొరియో గ్రఫీ చేసారు. అంతేకాకుండా తెలుగు డ్యాన్స్ షో లో కూడా తను జడ్జి గా చేసారు. రీసెంట్ తను కొరియోగ్రఫీ చేసిన విజయ్ నటించిన అరబిక్ కుతు సాంగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఇలా తను కొరియోగ్రఫీ చేసిన చాలా సాంగ్స్ హిట్ అయ్యాయి. బెంగళూర్ లో దొరికిన ప్రైవేటు పార్టీ లో కూడా తను అటెండ్ అయ్యాడు అని ఆరోపణలు కూడా ఉన్నాయి. డ్యాన్సర్ సతీష్ కూడా ఇది వరకు ఆరోపణలు చేసారు. జానీ మాస్టర్ కావాలని తనని పనికి రనివాట్లేదు అని ఆరోపణలు చేసారు.