ek mukhi rudraksha :
ప్రపంచ వ్యాప్తంగా ఏకముఖి ( ek mukhi rudraksha ) రుద్రాక్ష దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఏకముఖి రుద్రాక్ష చెట్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదు. అందుకే ఏకముఖి రుద్రాక్ష కి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఈ ఏకముఖి రుద్రాక్ష చెట్టు కి సంవత్సరకాలంలో ఒకటి లేదా రెండు రుద్రాక్షలు మాత్రమే కాస్తాయి. అందుకే వీటికి ఇంత డిమాండ్ ఉంది. ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే అంత మంచి జరుగుతుందని చెబుతుంటారు.
ప్రస్తుతం ఏకముఖి రుద్రాక్ష చెట్టు నేపాల్ లో ఉంటుంది. అక్కడ రాజవంశీయులు ఈ రుద్రాక్ష చెట్టుని జాగ్రత్త గా కాపాడుతున్నారు. ఎందుకంటే ఈ ఏకముఖి రుద్రాక్ష చెట్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదు. అంతేకాకుండా వీటికి చాలా తక్కువ సంఖ్యలో రుద్రాక్షలు కాస్తాయి. అందుకే నేపాల్ దేశం రాజవంశీయులు ఏకముఖి రుద్రాక్షను వివిధ దేశాలకి చెందిన ప్రముఖ వ్యక్తులకు భాహుకరిస్తుంటారు. ఇది చాలా విలువైనది గా వాళ్ళు భావిస్తారు.
కొందరు ఏకముఖి రుద్రాక్ష ( ek mukhi rudraksha ) చెట్లు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లోని శేషాశలం అడవుల్లో ఉన్నట్టుగా చెప్తారు. కానీ ఇంతవరకు ఎక్కడ ఉన్నది అని ఎవరు గుర్తించలేరు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ అరణ్యం లో నివసించే వాళ్ళకి ఈ చెట్టు గురించి తెలుసని కొందరు అంటూ ఉంటారు. కానీ కచ్చితమైన సమాచారం మాత్రం ఇవ్వలేరు.
ఈ ఏకముఖి రుద్రాక్షను ( ek mukhi rudraksha ) ధరిస్తే అంత మంచి జరుగుతుంది అని భావిస్తారు. మన ఇండియా లో కూడా కొన్ని చోట్ల ఈ ఏకముఖి రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. అంతేకాకుండా మలేసియా మరియు ఇండోనేసియా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా పెరుగుతాయి. ఏకముఖి రుద్రాక్షను సాక్షాత్తు శివుడి స్వరూపం అని నమ్ముతారు. ఈ ఏకముఖి రుద్రాక్ష కి పంచామృతం తో అభిషేకం కూడా చేస్తారు.
ఈ ఏకముఖి రుద్రాక్షని ( 1 mukhi rudraksha )పూజ చేయకుండా ధరించ కూడదు. ఏకముఖి రుద్రాక్షను పూజ చేయించిన తర్వాత మాత్రమే ధరించాలి. ఏకముఖి రుద్రాక్షను మహాశివరాత్రి నాడు గానీ , కార్తీక మాసంలో సోమవారం రోజున గానీ శివుడికి పూజ చేసి రుద్రాక్ష కి ఎరుపు రంగు పట్టుదారం , వెండి తీగ లేదా బంగారం తీగ తో కుచ్చి మెడలో హారంగా ధరించాలి. ఎప్పుడైనా మళ్ళీ రుద్రాక్ష కి అభిషేకం జరిపించి మళ్ళీ ధరించాలి. ఈ రుద్రాక్షను ధరించినప్పుడు మద్యపానం సేవించడం లేదా మాంసాహారం తినడం నిషేధించాలి. తరుచూ శివుడికి పూజ చేయాలి. ఇలా పూజ చేయడం వల్ల అంత మంచి జరుగుతుంది.
ఈ ఏకముఖి రుద్రాక్షను ( ek mukhi rudraksha benefits in telugu ) ధరించి శివుడికి నిత్యం పూజ చేయాలి.శివుడికి మరియు రుద్రాక్షకి పంచామృతం తో అభిషేకం చేయాలి. ఏకముఖి రుద్రాక్ష ని ధరించి పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో చేయాలి. వృద్దులకు మరియు పేదలకు దాన ధర్మాలు కూడా చేయాలి ఇలా చేస్తే చాలా పుణ్యం వస్తుంది. ఏకముఖి రుద్రాక్షను ధరించటం వల్ల సఖల సంపదలు కలుగుతాయని నమ్ముతారు.