Dragon fruit in telugu :
డ్రాగన్ ఫ్రూట్ ( dragon fruit in telugu ) అంటే ప్రస్తుతం ఇండియా లో బహుశ తెలియని వాళ్ళు ఉండరేమో. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ లో లభించే పోషకాలు అన్ని ఇన్ని కావు. అందుకే మార్కెట్ లో డ్రాగన్ ఫ్రూట్ కి మంచి మార్కెట్ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ లో చాలా పోషకాలు ఉంటాయి అందుకే ఈ పండు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. డ్రాగన్ ఫ్రూట్ చూడటానికి పింక్ కలర్ లో ఉంటుంది. ఈ ఫ్రూట్ లోపలి గుజ్జు భాగం తెల్లగా ఉంటుంది. ఈ తెల్లటి గుజ్జులో చాలా విత్తనాలు నలుపు రంగులో ఉంటాయి. ప్రతీ రోజు ఈ పండును తింటే ఆరోగ్యానికి మంచిది అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సాగుచేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ యొక్క రుచి కొంచం తియ్యగా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ ని సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.
డ్రాగన్ ఫ్రూట్ మెక్సికో కి చెందిన మొక్క అయినప్పటికీ దీనిని ఎక్కువగా చైనీస్ లో పండిస్తారు. డ్రాగన్ ఫ్రూట్ హైలోసెరస్ అనే కాక్టస్ మీద పెరుగుతుంది. థాయిలాండ్ మరియు వియత్నాం దేశాల్లో ఈ పండుని ఎక్కువగా తింటారు. మన ఇండియా లో కరోనా వైరస్ వ్యాధి విజృంభిస్తున్నప్పటి నుండి బాగా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ లో ( dragon fruit in telugu ) చాలా పోషకాలు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి దీని ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ ని ” పిటాయ ” ( pitaya ) అని కూడా పిలుస్తారు.
డ్రాగన్ ఫ్రూట్ లో పోషక విలువలు : Neutrients values in dragon fruit in telugu
డ్రాగన్ ఫ్రూట్ లో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్ని ఉంటాయి. అందుకే ఈ ఫ్రూట్ ని కరోనా టైం లో ఎక్కువగా తినే వారు. డ్రాగన్ ఫ్రూట్ లో మెగ్నీషియం, కాల్షియమ్ , ఫాస్పరస్ , ఐరన్ , ఫైబర్స్ , మినరల్స్ మరియు ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మన శరీరానికి కావల్సిన విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2 మరియు విటమిన్ బి3 పుష్కలంగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ ని ( dragon fruit in telugu ) తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని డాక్టర్స్ చెబుతున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు : Health benefits of dragon fruit in telugu
1.డ్రాగన్ ఫ్రూట్ లో ఆస్కార్బిక్ ఆసిడ్, ఫ్లేవోనాయిడ్స్ , ఫైనోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టీ ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి.అందుకే డయాబెటిక్ పేషంట్స్ ఈ పండు ని ఎక్కువగా తింటారు.
2.గుండే సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు డ్రాగన్ ఫ్రూట్ తింటే గుండే ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ లో ఒమేగా 3 మరియు ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.కాబట్టి ఇది మన శరీరములో HDL cholesterol స్థాయిని పెంచుతుంది.
3.డ్రాగన్ ఫ్రూట్ క్యాన్సర్ భారిన పడకుండా కాపాడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో యాంటి ఆక్సిడెంట్స్, యాంటిట్యూమర్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ ఫ్రూట్ ని క్యాన్సర్ పేషంట్స్ తినడం చాల మంచిది.
4.డ్రాగన్ ఫ్రూట్ లో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ ఫ్రూట్ తినడం వల్ల అర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
5.డ్రాగన్ ఫ్రూట్ లో మన శరీరానికి కావల్సిన విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరములో రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా డ్రాగన్ ఫ్రూట్ లో కేరోటినాయిడ్స్ కూడా ఉంటాయి. మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా కాపాడుతుంది.
6.మన శరీరములో ఆక్సీకరణ వొత్తిడి కారణంగా , మానసిక ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. తద్వారా పార్కిన్సన్, అల్జీమర్స్ వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. అందుకే మెదడు పనితీరు బాగా పనిచేయడానికి డ్రాగన్ ఫ్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.