Cumin seeds in telugu :
Cumin seeds అంటే తెలుగులో జీలకర్ర అని అర్థం. జీలకర్రను ( cumin seeds in telugu) రోజు మనం చేసుకునే ఆహారాల్లో వాడుతూనే ఉంటాం. కానీ జీలకర్ర ఏన్ని విధాలుగా మన శరీరానికి మంచి చేస్తుందో ఎవరికి తెలియదు.
జీలకర్రను ఎలా వాడాలి ఏ విధంగా తీసుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీలకర్రను ( cumin seeds in telugu) చాలా మంది బరువు తగ్గడానికి వాడుతుంటారు. ఒక బరువు తగ్గడానికే కాదు ఇది మనకు తెలియకుండానే మన శరీరానికి చాలా మంచి చేస్తుంది.
జీలకర్రలో మనకు లభించే పోషకాలు : ( cumin seeds in telugu )
1.జీలకర్రలో అధికంగా విటమిన్ B ఉంటుంది. ఇది మన శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది. ఇందులో అధికంగా B విటమిన్ ఉండడం వలన ఇది మన మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కొన్ని జీలకర్ర టీ ని తాగడం మనకు ఎంతో మేలు చేస్తుంది.
2.జీలకర్ర లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ ఆక్సిజెన్ ని గుండెకు సరఫరా చేస్తుంది. కాబట్టి మనం జీలకర్ర తరచుగా తీసుకుంటూ ఉంటే ఐరన్ తరుగుదల నుండి మనం బయట పడవచ్చు.
3.మీకు మీ చర్మం కాంతి వంతంగా ఉండాలని అనుకుంటే మీరు జీలకర్రను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర లో విటమిన్ E ఎక్కువగా ఉంటుంది. ఇది మీ హార్మోన్స్ సరిగా పనిచేయడానికి మరియు మీకు ఏవైనా చర్మం పై ఉన్న గాయాలను కూడా నయం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
4.జీలకర్ర లో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది మన శరీర విశ్రాంతికి ఎంతో తోడ్పుతుంది.
5.జీలకర్ర లో మాంగనీస్ కూడా ఉంటుంది.
6.జీలకర్ర లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనం జీలకర్ర తరచుగా తీసుకుంటూ ఉండాలి.
7.జీలకర్ర ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సబంధించిన వాటికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవి ఏమిటంటే పొట్ట ఉబ్బరంగ ఉన్నపుడు మరియు వికారంగా ఉన్నపుడు వాంతులు అవుతున్నపుడు మరియు ఆహారం జీర్ణం కానపుడు ఇలాంటి వాటితో బాధపడేవారు ఉపశమనం పొందడానికి జీలకర్ర ఎంతో సహాయపడుతుంది.
8.జీలకర్ర ని బరువు తగ్గడానికి ఉపయోగిస్తారు. బరువు తగ్గడానికి రోజు ఉదయం లేవగానే జీర టీ ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
9.జీలకర్ర మధుమేహం నియంత్రణలో ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాది ఉన్న వారు జీలకర్రను కాస్త ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.
10.జీలకర్రను IBS ఉన్న వారు తీసుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు.
11.జీలకర్ర లో ఎక్కువ శాతం యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వలన ఇది మన శరీరానికి కావల్సిన ఎనర్జీని అంధిస్తుంది. అలాగే మన శరీరంలో ఉన్న చెత్తను బయటకి పంపడానికి ఎంతో ఉయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు.
12.జీలకర్ర లో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి. కాన్సర్ తో బాధ పడే వారు తరుచూ జీలకర్రను తీసుకోవడం మంచిది.
13.జీలకర్ర చర్మం కాంతి వంతంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు మొటిమలు తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
14.జీర అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రణలో పెట్టడానికి ఉపయోగపడుతుంది.
15.పైల్స్ తో బాధపడే వారు జీలకర్ర ని తరుచూ తీసుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు.
16.జీలకర్ర ఆస్తమాతో బాధపడే వారికి తరుచూ జలుబుతో బాధపడే వారికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది.
జీలకర్ర ఉపయోగాలు :
1.బరువు తగ్గడానికి జీలకర్రను ఉపయోగిస్తారు.
2.మధుమేహ వ్యాధిని అదుపులో పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు.
3.మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.
4.చర్మ వ్యాధులను నివారిస్తుంది.
5.కాన్సర్ వ్యాధులకు జీలకర్ర చాలా మంచిది.
6.యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా ఉయోగపడుతుంది.
7.పైల్స్ తో బాధ పడే వారికి జీలకర్ర చాలా ఉయోగపడుతుంది.
జీలకర్ర చాలా విధాలుగా తీసుకోవచ్చు కానీ అందరూ దీనిని టీ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు.