coconut oil for hair :
మన పూర్వీకుల కాలం నుంచి తర తరాలు గా కొబ్బరి నూనె ను ( coconut oil for hair ) జుట్టు కి వాడుతుంటారు. కొబ్బరి నూనె ను జుట్టు కి అప్లై చేయడం వల్ల జుట్టు మంచి వొత్తుగా మరియు బలంగా పెరుగుతుంది. అంతేకాకుండా కొబ్బరి నూనె లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కొబ్బరి నూనెను మనం జుట్టు కి అప్లై చేస్తే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా చుండ్రు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ కొబ్బరి నూనెను తలకు పట్టిస్తే చుండ్రు వంటి సమస్య కూడా తగ్గుతుంది. కొబ్బరి నూనె జుట్టు కి ఒక మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.
కొబ్బరి నూనె ను ఎండు కొబ్బరి నుంచి తీస్తారు. ఈ కొబ్బరి నూనె తీయటి రుచి ను కలిగి ఉంటుంది. దీన్ని ఎక్కువగా చర్మ సౌందర్యానికి కి కూడా వాడుతారు. అంతేకాకుండా కేరళ వాళ్ళు దీన్ని వంట నూనె గా కూడా వాడుతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. డాక్టర్లు సైతం ఈ కొబ్బరి నూనె నీ వాడమని సూచిస్తున్నారు. కొబ్బరి నూనెను వంటకాల్లో వాడటం వల్ల ఇది మన శరీరంలో చెడు కొలెస్టిరాల్ చేరకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇది జుట్టు పెరుగుదల కి బాగా ఉపయోగపడుతుంది.
కావాల్సిన పదార్థాలు :
2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె
వాడే విధానం :
చిన్న గిన్నెలో కొబ్బరి నూనె ను తీసుకుని గ్యాస్ స్టవ్ పెట్టి తక్కువ ఫ్లేమ్ లో పెట్టి వేడి చేయాలి. తర్వాత కొంచం చల్లార్చి జుట్టు కి అప్లై చేయాలి. ఒక 5 నిమిషాలు తలపై మర్దన చేయాలి. అప్లై చేశాక 30 నిమిషాల తర్వాత లేదా రాత్రి మొత్తం తలకు అలాగే పెట్టుకుని ప్రొద్దున షాంపూ తో కడిగేయండి. ఇలా చేయడం ద్వారా మీ జుట్టు రాలిపోవడం ఆగిపోవడమే కాకుండా ధృడంగా కూడా పెరుగుతుంది.