Cloves Benefits :
లవంగాలు cloves benefits అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది వాటి యొక్క ఘాటు మరియు సువాసన కదా …! కానీ వీటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా లవంగాలను వివిధ రకాల వంటకాలలో వాడుతారు. లవంగాలు ఒక మొక్క నుండి వచ్చే పూల మొగ్గలు ఇవి మొదట ఇండోేషియాలోని మొలక్కాస్ అనే దీవులలో గుర్తించారు. లవంగాల యొక్క శాస్ర్తియ నామం సిజిజియం ఆరోమాటికంలా పిలుస్తారు.
ఈ లవంగాలు ( cloves benefits ) సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి. వీటిని ఎక్కువగా టీ రూపంలోనూ మరియు ఏదైనా ఘాటు ఎక్కువ అవసరం అనుకునే వంటకాలలో ఉపయోగిస్తారు. అంతే కాదు ఇది ఎన్నో ఆయుర్వేదిక్ మందుల తయారీలో కూడా వాడుతారు. ఇందులో మన శరీరానికి కావాల్సిన యాంటీ వైరల్ ,యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ ఇనఫ్లమేటరీ గుణాలు ఉన్నట్లు ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు.
లవంగాల యొక్క ఉపయోగాలు : cloves benefits
క్యాన్సర్ ( cancer ) : లవంగాల లో యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగిన ఉన్నాయని వీటిని టీ రూపంలో కానీ వంటకాలలో వాడడం వలన కానీ క్యాన్సర్ వ్యాధి రాకుండా కాపాడుతుందని పరిశోధకులు వెల్లడించారు.
పళ్ళు ( clove dental ): లవంగాల నూనె పంటి నొప్పికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ లవంగాలు పంటి నొప్పి రాకుండా పళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడతాయి.
బొక్కలు( bones ) : లవంగాల పొడి చిన్న వయసు పిల్లలకి వాడడం వలన వారి బొక్కలు ధృండంగా తయారవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
జ్వరం,దగ్గు,జలుబు ( fever, cough, cold ) : లవంగాల్లో ( cloves benefits ) యాంటి వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలగా ఉన్నాయి. కాబట్టి లవంగాలను జ్వరానికి ,జలుబుకు, దగ్గుకి ,మరియు శరీరంలో ఎలాంటి ఇన్ఫ్లమేషన్ వచ్చిన టీ రూపంలో తీసుకోవడం వలన ఉపశమనాన్ని పొందవచ్చు. అంతే కాదు మళ్ళీ ఎలాంటి ఇన్ఫ్లమేషన్ రాకుండా కూడా జాగ్రత్త పడొచ్చు.
కడుపు ఉబ్బసం, అజీర్తి ( gas, bloating, indigestion ) :
చాలా మందికి ఆహారం సరిగా అరగకపోవడం , కడుపు ఉబ్బినట్టుగా ఉండడం, కడుపులో గ్యాస్ ఇలా బాధపడుతూ ఉంటారు . ఈ సమస్యల కి లవంగాలు బాగా ఉపయోగపడుతాయి. లవంగాల పొడి నీ తేనె తో కలిపి తీసుకోవడం వలన ఉపశమనాన్ని కలిగిస్తుంది.
కాలేయ వ్యాధులు( liver desease ) : కాలేయానికి సంబంధించిన వ్యాధులను నివారించడానికి లవంగాలు ఉపయోగపడతాయని పరిశోధనలలో వెల్లడైంది.
కడుపులో నులపురుగులు ( intestinal worms ) : లవంగాలు కడుపులో ఏర్పడే నులిపురుగుల నివారించడానికి ఎంతో ఉపయోగపడతాయని నమ్ముతారు.
నోటి దుర్వాస ( bad smell in mouth ) : కొందరిలో నోటి దుర్వాస చాలా బాధిస్తుంది ఎవరితో దగ్గర ఉండి మాట్లాడలేరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆలాంటి వారికి లవంగాలు చాలా ఉపయోగపడుతాయి.
చర్మం, వెంట్రుకలు( cloves for hair and skin ) : మనం వాడే కొన్ని సబ్బులలో మరియు నూనెలో లవంగాలను వాడుతూ ఉంటారు. లవంగాల లో ఉండే అంటి బ్యాక్టీరియాల్ గుణాలు మన చర్మానికి వెంట్రుకలకు ఎంతో ఉపయోగపడుతాయి.
మధుమేహం ( diabeties ) : లవంగాలు మధుమహంతో బాధపడే వారికి ఎంతో మంచిదని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఇవి రక్తంలోని చక్కెరని తగ్గించి మధుమహన్ని నియంత్రిస్తుంది