HomeHealthClove oil : లవంగం నూనె తో ఆరోగ్య ప్రయోజనాలు

Clove oil : లవంగం నూనె తో ఆరోగ్య ప్రయోజనాలు

Clove oil :

లవంగం ని ( cloves ) మనం తరచూ వాడుతుంటాం. లవంగం ని ఎక్కువగా నోటి దుర్వాస రాకుండా వాడుతారు. అంతేకాకుండా లవంగం ని వంటకాల్లో కూడా ఎక్కువగా వాడుతారు. లవంగం ఆయిల్ ని ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో కూడా వాడుతారు. ఇలా లవంగం తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

లవంగం నూనె ని ( clove oil ) పూర్వ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆయుర్వేద మందుల తయారీలో వాడుతారు. లవంగం నూనె ని లవంగం చెట్ల ( clove plant ) నుంచి సేకరిస్తారు . లవంగం నూనె రంగు లేని మరియు లేత పసుపు రంగు లో ఉంటుంది. లవంగం నూనె తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మరీ ఎక్కువగా తీసుకుంటే ఎన్నో దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది.

లవంగం నూనె ని ఎక్కువగా తీసుకుంటే చర్మం దురద రావడం మరియు చర్మం అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. అందుకే అవసరం అయినంత వరకు మాత్రమే ఉపయోగించాలి. లవంగం నూనె కొంచం ఘాటు వాసనను కలిగి ఉంటుంది. లవంగం ని ఎక్కువగా జాంజిబార్ ద్వీపం లో ఎక్కువగా పండిస్తారు. అంతేకాకుండా ఇండోనేసియా లో కూడా లవంగం ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు.

లవంగాలను ( cloves ) భారత దేశంలో ఒక్కో ప్రాంతం లో ఒక్కో రకంగా పిలుస్తారు. ( clove in telugu ) తెలుగులో లవంగాలు అని ( clove in English ) ఇంగ్లీషు లో క్లోవ్ అని ( clove in Hindi ) హిందీలో ల్వాగ్ అని ( clove in Tamil ) తమిళంలో కిరంపు అని ( clove in Malayalam ) మలయాళంలో గ్రంబూ అని ( clove in Marathi ) మరాఠీ లో లవంగ అని ( clove in kannada ) కన్నడ లో లవంగ అని పిలుస్తారు.

లవంగాలలో పోషక విలువలు :

లవంగాలలో కూడా శరీరానికి అవసరమైన కొన్ని పోషక విలువలు కలిగి ఉన్నట్టు శాస్త్రవేత్తలు పరిశోధనలలో తెలిపారు. ప్రొటీన్లు 0.13 గ్రాములు,0.27 గ్రాముల ఫ్యాట్,1.38 గ్రాములు కార్బోహైడ్రట్స్ ,0.7 గ్రాములు ఫైబర్, పొటాషియం, విటమిన్ కె, బీటా కెరటిన్, ఐరన్, కాల్షియం లాంటి పోషక విలువలు లవంగాలు కలిగి ఉన్నాయి.

clove oil health benefits : లవంగం నూనె యొక్క ఉపయోగాలు

1.లవంగం నూనె కావిటీస్ ని నిరోధించడానికి మరియు పంటి నొప్పి సమస్యను తగ్గించడానికి ఎక్కువగా వాడుతారు. పంటి నొప్పి తగ్గించే మెడిసిన్ లో కూడా లవంగం నూనె ని వాడుతారు. కొన్ని రకాల టూత్ పేస్టు లో మరియు మౌత్ వాష్ వాటిలో కూడా లవంగం నూనె ని వాడుతారు.

2.పళ్ళ ని సరిగా శుభ్రం చేయని వాళ్ళలో నోటి దుర్వాస ఎక్కువగా వస్తుంది. అలాంటి వారు లవంగం నూనె నీ వాడితే నోటి దుర్వాస పోవడమే కాకుండా, బ్యాక్టీరియా ని కూడా చంపుతుంది.

3.మొటిమలు తగ్గించడం లో లవంగం నూనె ఎంతగానో దోహదపడుతుంది. మొటిమలకు కారణం అయ్యే ప్రోపియోని బ్యాక్టీరియా ని గ్రోత్ అవ్వకుండా చూసి మొహంపై మొటిమలను తగ్గిస్తుంది.

4.లవంగం నూనె ని నడుము నొప్పి ని తగ్గించడానికి ఎక్కువగా వాడుతారు. మసాజ్ సెంటర్లో వీటిని ఎక్కువగా వాడుతారు.

5.లవంగం నూనె లో యాంటీ ఇరిటంట్ లక్షణాలు ఉంటాయి. లవంగం నూనె వికారం మరియు వాంతులు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ వ్యవస్థను సాఫీగా జరిగేలా చేస్తుంది.

6.లవంగం నూనె శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరం ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా కాపాడుతుంది. శరీరానికి హాని చేసే ప్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది.

Side effects cloves or clove oil :

లవంగాల తో చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా అని అధికంగా తీసుకోవడం కూడా మంచిది కాదు మోతాదుకు మించి అది తీసుకున్న అది దుష్ఫలతాలను ఇస్తుంది. కాబట్టి లవంగాలను ఎక్కువ తీసుకోకుండా ఉండడం మంచిది. ఒక మనిషి రోజుకి 2.5 mg తీసుకోవచ్చు.

RELATED ARTICLES
LATEST ARTICLES