Cinnamon benefits for women :
దాల్చిన చెక్క ( cinnamon ) ఒక రకమైన సుగందని ఘటూ ని కలిగి ఉన్న మసాలా దినుసు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ తెలుసు కానీ ఇది అన్ని రకాలుగా మానవ శరీరానికి మేలు చేస్తుందో కొందరికి మాత్రమే తెలిసి ఉంటుంది. దాల్చిన చెక్క మొదటగా ఈజిప్టు నుండి అయా దేశాలకు దిగుమతి చేసేవారని నివేదించారు. దాల్చిన చెక్క ( cinnamon benefits ) పురాతన కాలం నుండి చాలా విలువైనది ప్రసిద్ది చెందినదిగా పేరు గాంచింది.
దాల్చిన చెక్క లో ( cinnamon in telugu ) యాంటీ క్యాన్సర్,యాంటీ బాక్టీరియల్ మరియు కొన్ని రకాల న్యూట్రిషనల్ విలువలు కూడా కలిగి ఉన్నట్టు శాస్త్రవేత్తలు పరిశోధనలలో తెలిపారు. దాల్చిన చెక్కలో అధిక శాతం పొటాషియం ఉంది. పొటాషియం 34 ఎంజీ ఎంజీ , డైటరీ ఫైబర్ 4 గ్రాములు , కార్బోహైడ్రేట్స్ 6 గ్రాములు, మాంగనీస్ 70%, ఐరన్ 4mg,విటమిన్స్ 2% ని కలిగి ఉంది.
ఆడవారికి దాల్చిన చెక్క ఉపయోగాలు ( cinnamon benefits ):
మధుమేహం ( cinnamon for diabeties ) :
మధుమేహం తో బాధపడే వారిలో దాల్చిన చెక్క ని వాడడం వలన వారి HBA1C లో మార్పు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. HBA1C అనేది మూడు నెలలుగా మన శరీరంలోని రక్తం లో షుగర్ లెవెల్స్ నిర్ధారించే ఒక పరీక్ష. రక్తంలోని హిమోగ్లోబిన్ A1c దాల్చిన చెక్క ( cinnamon benefits ) తీసుకోవడం వలన తగ్గించుకోవచ్చు. తద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుందని డాక్టర్స్ సూచిస్తున్నారు.
గర్భాశయ వ్యాధి ( cinnamon for uterus ) :
దాల్చిన చెక్కను ఆడవారిలో ఎక్కువగా బాధపెట్టే గర్భానికి సంబంధించిన అనేక రకాల ఇన్ఫెక్షన్స్ కి ఉపయోగిస్తారు. అంతే కాదు pcod మరియు pcos లాంటి అండశయానికి సంబంధించిన సమస్య లకు మంచి ఔశదంగా పనిచేస్తుంది.
క్యాన్సర్ ( cancer ):
దాల్చిన చెక్క క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉండటం వలన ఇవి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయి.
PMS లక్షణాలు ( pre menstrual syndrome ):
PMS లక్షణాలు అంటే ఆడవారిలో రుతు స్రావం జరిగే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కడుపులో నొప్పి, నీరసం, కాళ్ళ నొప్పులు లాంటివి మొదలగునవి.. ఇలా వచ్చే లక్షణాలను దాల్చిన చెక్క తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు.
హార్మోనల్ ఇంబలన్స్ (hormonal imbalance): ప్రస్తుత కాలంలో చాలా మంది ఆడవారు హార్మోనల్ ఇంబాలన్స్ తో బాధపడుతున్నారు. దాల్చిన చెక్క హార్మోన్స్ ని సరిచేయడం లో మన శరీరానికి చాల ఉపయోగపడుతుందని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.
వంధ్యత్వం ( Infertility ): దాల్చిన చెక్క ని ఆహారం లో భాగంగా తీసుకోవడం వలన గర్భాశయం మరియు ఓవరిస్ ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. తద్వారా వంధ్యత్వం దూరం చేసి పిల్లలు కలిగేలా దోహదపడుతుంది. దీనికి ఎలాంటి శాస్ర్తీయ పరిశోధనలలో తెలపలేదు. కానీ కొంత మంది వాడిన వారు వారి యొక్క అనుభవాన్ని బట్టి ఉపయోగిస్తున్నారు.