Chia seeds in telugu:
ప్రస్తుతం ఉన్న రోజుల్లో చియా సీడ్స్ అనే మాట కొందరి నోటి నుండి వింటున్నాం. ఇంతకీ చియా సీడ్స్ అంటే ఏమిటి వాటి వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం. చియా సీడ్స్ యొక్క ఉపయోగాలు దాదాపు ఎవరికి సరిగా తెలియవు మరియు వాటిని ఎలా తీసుకోవాలో కూడా అంతగా తెలియదు. మొదటగా చియా సీడ్స్ ని ఎలా తీసుకోవాలో చూద్దాం.
చియా సీడ్స్ తీసుకొనే విధానాలు:
చియా సీడ్స్ నీ తీసుకొనే ముందు వాటిని నానబెట్టాలి. ఎలా అంటే మీరు ఓట్స్ తో తీసుకోవాలి అనుకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తీసుకోవచ్చు లేదా మీరు మజ్జిగతో తీసుకోవాలి అనుకుంటే మజ్జిగలో ఒక అర్ధగంట నానబెట్టి తినచ్చు. ఇలా చాలా రకాలుగా చియా సీడ్స్ నీ తీసుకోవచ్చు.
అసలు చియా సీడ్స్ నీ ఎందుకు వీటిని తీసుకోవాలి అంటే ఉపయోగం ఏంటి అని ప్రశ్న మీలో ఉండచ్చు దానికి సమాధానాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని ఇప్పుడు తెలుసుకొందాం.
చియా సీడ్స్ ఉపయోగాలు: Chia seeds in telugu
1.చియా సీడ్స్ నీ తీసుకోవడం వల్ల శరీరంలోని చెక్కర నీ తగ్గించవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ఇవి తీసుకోవడం వల్ల చెక్కర వ్యాధి ఉన్న వారు మరియు లేని వారు ఎవరైనా కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి.
2. చియా సీడ్స్ లో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.
3. చియా సీడ్స్ తీసుకోవడం వలన శరీరంలో కాల్షియం పెరుగుతుంది. చీయా సీడ్స్ లో పాలలో దొరికే కాల్షియం కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు చియా సీడ్స్ నీ తీసుకొంటే తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది అని నిపుణులు అంటున్నారు.
4. అలాగే ఎవరు B విటమిన్ లోపంతో బాధపడుతున్నారో వాళ్ళు చియా సీడ్స్ నీ తీసుకోవడం ద్వారా ఆ లోపాన్ని తొందరగా తగ్గించవచ్చు. ఎందుకంటే చియా సీడ్స్ లో B విటమిన్స్ సమృద్ధిగా ఉంటుంది.
5. చియా సీడ్స్ లో అధిక ఫైబర్ ఉండడం వలన శరీరానికి చాలా ఉపయోగపడుతాయి. చియా సీడ్స్ లో ప్రోటీన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుందని చియా సీడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్ బాగా అందుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
6. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఎనర్జిటిక్ గా ఉంటారు. మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
7. చియాడ్స్ మన స్కిన్ నీ కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది మరియు కొందరికి గోర్లు అవే విరిగిపోవడం బలంగా లేకపోవడం అటువంటి వారు చియా సీడ్స్ తీసుకోవడం వల్ల గోర్లు మృదువుగా ఉంటాయి.
8. చియాడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ తీసుకోవడం వల్ల కొందరు ఇబ్బందులు కూడా ఎదురుకావచ్చు ఎందుకంటే చియా సీడ్స్ లో అధిక ఫైబర్ ఉండటం వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మరికొందరికి చియా సీడ్స్ పడకపోవడం వల్ల రావడం జరుగుతుంది. చియా సీడ్స్ వల్ల ఉపయోగాలు ఉన్నాయ్ కదా అని మోతాదుకు మించి తీసుకోకూడదు.