HomeHealthBlackberry fruit : బ్లాక్ బెర్రీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

Blackberry fruit : బ్లాక్ బెర్రీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

Blackberry fruit :

బ్లాక్ బెర్రీ ఫ్రూట్ ని ( blackberry fruit in telugu ) తెలుగు భాషలో నల్ల రేగు పండు అని పిలుస్తారు. ఈ బ్లాక్ బెర్రీ పండ్లు చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రలలో ఎక్కువగా సాగు చేయరు కాబట్టి బ్లాక్ బెర్రీ పండ్లు చూడటానికి నలుపు రంగులో గుండ్రటి ఆకారం కలిగి రుచికి తియ్యగా ఉంటాయి. ఈ బ్లాక్ బెర్రీ పండ్లను సాధారణంగా అందరూ ఫ్రూట్ జ్యూస్ ల ,టీ మరియు విస్కీ లాగా , స్నాక్ లాగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా తీసుకుంటారు.ఈ బ్లాక్ బెర్రీ చెట్లు పొదలుగా పెరుగుతాయి. ఈ బ్లాక్ బెర్రీ చెట్టు రూబేస్ జాతికి చెందిన చెట్టు మరియు అలాగే ఇది రోసేసి కుటుంబానికి చెందినదిగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ బ్లాక్ బెర్రీ చెట్లు మొదటగా అమెరికా లో కనుగొనబడినట్టు నమ్ముతారు. ఈ చెట్లు ఎక్కువగా అడవిలో మరియు పొదలలో పెరుగుతాయి.

బ్లాక్ బెర్రీ ( blackberry fruit ) చెట్లు మొదటగా అమెరికా లో సాగు మొదలై ఆసియా మరియు ఐరోపా దేశాలు కూడా సాగు చేస్తున్నారు. బ్లాక్ బెర్రీ చెట్లను మనం ఒకసారి నాటితే చాలు శశ్వాతంగా ఉండిపోతాయి. ఇవి పోదలుగా విస్తరిస్తూనే ఉంటాయి. ఈ చెట్లకు ముల్లులు కూడా ఉంటాయి. కొండలు మరియు అడవులు ముళ్ళ పొదలు ఈ బ్లాక్ బెర్రీ చెట్లు సాగు చేయడానికి అనుకూలమైన ప్రదేశాలుగా చెప్తున్నారు. ఈ చెట్లు శీతాకాలం చివర దశ నుండి వేసవి కాలం మొదటి దశలో ఎక్కువగా చిగురిస్తుంది.

బ్లాక్ బెర్రీ పండ్లు ( blackberry fruit ) చూడటానికి దాదాపు మల్బరీ పండ్ల మాదిరిగానే ఉంటాయి. మల్బరీ పండ్లు బ్లాక్ బెర్రీ పండ్లలతో పోలిస్తే కొంచం పొడవుగా సన్నగా ఉంటాయి. మల్బరీ చెట్టు పొడవుగా పెరుగుతుంది ఈ బ్లాక్ బెర్రీ చెట్టు పొదలు పెరుగుతుంది.బ్లాక్ బెర్రీ పండ్లను ఏ ప్రాంతానికి చెందిన వారు వారి వాడుక భాషలలో పిలుస్తారు. తెలుగులో బ్లాక్ బెర్రీని నల్ల రేగి పండు ( blackberry in telugu ) అని, హిందీలో బ్లైకాబీరీ ( blackberry ina Hindi ) అని, తమిళంలో కరుపట్టి మరం ( blackberry in Tamil ) అని,మలయాళం లో బ్లాక్కబెర్రి పజం ( blackberry in Malayalam ) అని, బెంగాలీలో కలోజం ( blackberry in Bengali ) అని,మరాఠీలో బ్లేక బెర్రీ ( blackberry in Maraati ) అని వివిధ రకాలుగా పిలుస్తారు.

బ్లాక్ బెర్రీ పండ్లలలో పోషక విలువలు : Neutrients values in blackberry fruit

బ్లాక్ బెర్రీ పండ్లలలో అన్ని రకాల విటమిన్స్ మరియు మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయని వీటిని తినటం వలన మనిషి ఆరోగ్యంగా ఉండవచ్చని డాక్టర్స్ చెప్తున్నారు. సాధారణంగా వంద గ్రాముల బ్లాక్ బెర్రీ పండ్లలలో కార్బహైడ్రేట్స్ 9.7 mg, షుగర్స్ 4.7, ఫైబర్ 5.3,ఫ్యాట్ 0.5, ప్రోటీన్స్ 1.4, విటమిన్స్ లలో విటమిన్ ఎ 215 , విటమిన్ బి సంబంధించిన b12, b1,b2,b3,b6 అన్ని దొరుకుతాయి. విటమిన్ సి 21mg మరియు ఇ 1.17, విటమిన్ కె 19.8,మినరల్స్ లో కాల్షియం 29, ఐరన్ 0 .64, మెగ్నషియం 20mg,జింక్ 0.54 mg ,పస్పరస్ 22mg, పొటాషియం 162mg, సోడియం 1 g, మాంగనీస్ 0.647 mg, వాటర్ 88g ఉంటాయని న్యూట్రీషన్లు వీటిని తీసుకోవడం మంచిది అని సూచిస్తున్నారు.

బ్లాక్ బెర్రీ పండ్ల ఉపయోగాలు ( health benifits of blackberry fruits )

1.బ్లాక్ బెర్రీ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాదు ఇది ఐరన్ రక్తంలో చేరేలా చేస్తుంది.

2.బ్లాక్ బెర్రీ పండ్లు క్యాన్సర్ ని నిరోధించడానికి సహయపడుతాయి. ఇందులో ఉండే ఆంటీయాక్సిడెంట్స్ కారణంగా క్యాన్సర్ వచ్చిన వారు ఈ బ్లాక్ బెర్రీ పండ్లని తింటే శరీరంలో కేన్సర్ ని అడ్డుకోవచ్చు.

3.బ్లాక్ బెర్రీ పండ్లలో విటమిన్ ఎ ఉంటుంది. విటమిన్ ఎ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడు తుంది.

4.బ్లాక్ బెర్రీ లలో ఉండే పీచు పదార్థం వలన తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఇలా తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కాబట్టి రక్తంలోని కి చక్కెరను తొందరగా ఉత్పత్తి చేయదు. కావున మధుమేహ వ్యాధులకు మంచి ఆహారంగా సూచిస్తారు.

5.బ్లాక్ బెర్రీ పండ్లు తినటం వలన రక్త నాళాలలో ఉన్న కొవ్వును కరిగించి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.

6.బ్లాక్ బెర్రీ పండ్లలో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచబడడానికి సహాయపడుతుంది .

RELATED ARTICLES
LATEST ARTICLES