Biggboss 6 winner :
స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 6 ( biggboss 6 winner ) గ్రాండ్ ఫైనల్ ఈరోజు ప్రసారం అవుతుంది. తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ 6 విన్నర్ ఎవరు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం 15 మంది కాంటెస్ట్ తో ఈ బిగ్ బాస్ 6 తెలుగు షో ప్రారంభం అయ్యింది. 105 రోజులు జరిగిన ఈ షో లో బిగ్ బాస్ విన్నర్ గా ఇండియన్ ఐడల్ విన్నర్ సింగర్ రేవంత్ గెలిచారు. సింగర్ రేవంత్ కి ఈ బిగ్ బాస్ 6 తెలుగు షో కన్న ముందే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
బిగ్ బాస్ 6 తెలుగు షో లో గ్రాండ్ ఫైనల్ కి కీర్తి , యూట్యూబర్ ఆది రెడ్డి, రోహిత్, శ్రిహాన్ మరియు రేవంత్ ఫైనల్ రేస్ లో మిగిలారు. చివరకు సింగర్ రేవంత్ బిగ్ బాస్ 6 తెలుగు షో విన్నర్ ( biggboss 6 winner ) గా నిలిచారు. ఈ బిగ్ బాస్ 6 షో ద్వారా రేవంత్ గెలుచుకున్నది ఎంతో తెలుసా ? అక్షరాల యాబై లక్షల రూపాయలు. యాబై లక్షల రూపాయలే నగదు బహుమతి యే కాకుండా సువర్ణ భూమి వారి ఒక చిన్న ఇల్లు కూడా గిఫ్ట్ గా ఇచ్చారు.
మొదటి నుంచి రేవంత్ కి తన ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేశారు. అంతేకాకుండా రేవంత్ కూడా మొదటి నుంచి చివరి ఎపిసోడ్ వరకు బిగ్ బాస్ హౌస్ లో చాలా చురుగ్గా ఉన్నాడు. బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లు అన్నింటిలో రేవంత్ చాలా ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు. చివరకు ఫ్యాన్స్ పెద్ద మొత్తంలో ఓట్లు వేసి రేవంత్ ని గెలిపించారు. ఈ బిగ్ బాస్ 6 తెలుగు షో ద్వారా రేవంత్ బారి మొత్తం లో నే ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.
ఈ బిగ్ బాస్ 6 తెలుగు షోలో 1st రన్నర్ గా శ్రిహాన్ మరియు 2 వ స్థానంలో కీర్తి మరియు 3 వ స్థానంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆది రెడ్డి తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుని 3 వ స్థానంలో ఉండగా మరియు నాల్గవ స్థానంలో రోహిత్ ఉన్నారు.