Benefits of watermelon seeds :
మండే వేసవిలో సేద తీరడానికి అందరం రక రకాల పానీయాలను తాగుతుంటాం అయిన కూడా దప్పిక తీరదు. ఎందుకంటే వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే వేసవి కాలంలో ఎక్కువగా బయట తిరిగితే డీహైడ్రేషన్ కి లోనయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వేసవిలో బయట తిరగకపోవడమే మంచిది. వేసవి కాలం రాగానే రోడ్డు పైన ఈ పుచ్చకాయలు ( benefits of watermelon seeds )దర్శనం ఇస్తాయి. వేసవి కాలంలో వీటికి మంచి డిమాండ్ ఉంది. కర్బుజా సీజనల్ ఫ్రూట్ కాబట్టి వేసవి కాలంలో మాత్రమే లభిస్తుంది.
వేసవి కాలం లో దొరికే ఈ పుచ్చకాయ జ్యూస్ ( watermelon juice ) త్రాగితే చాలా లాభాలు ఉన్నాయి. శరీరం డీహైడ్రేషన్ పాలు కాకుండా కాపాడుతుంది. ఇందులో నీరు శాతం కూడా ఎక్కువే ఉంటుంది. రోజు ఈ పుచ్చకాయ జ్యూస్ ని ( watermelon juice ) త్రాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పుచ్చకాయలో 92 శాతం నీరు మాత్రమే ఉంటుంది. పుచ్చకాయ తినేటప్పుడు మనం వాటిలో ఉన్న గింజలను తీసి పడేస్తాం. కానీ ఈ పుచ్చకాయ గింజలతో కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఇవి కూడా మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. అందుకే తినేటపుడు వీటిని పడేస్తారు.
పుచ్చకాయ గింజల్లో ( benefits of watermelon seeds ) విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, ఫోలేట్ , ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లేటరీ ఏజెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే పుచ్చకాయ గింజలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే. అందుకే పుచ్చకాయ తినేటప్పుడు గింజల్ని పడేయకండి.
Benefits of watermelon seeds : పుచ్చకాయ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు
- పుచ్చకాయ గింజల్లో ( watermelon seeds ) ప్రొటీన్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
- పుచ్చకాయ గింజల్లో ఐరన్ ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు ఈ పుచ్చకాయ గింజల్ని తింటే మంచి ఫలితం ఉంటుంది.
- పుచ్చకాయ గింజల్లో ఐరన్ , కాపర్ మరియు పొటాషియం ఉంటుంది. ఇవి ఎముకలు దృఢంగా ఉండటానికి సహాయపడతాయి. కాబట్టి పుచ్చకాయ గింజలు తినడం ఎముకల కి చాలా మంచిది.
- పుచ్చకాయ గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ ని డయాబెటిక్ పేషంట్స్ తినడం చాలా మంచిది. రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
- పుచ్చకాయ గింజల్లో మోనోఅన్ శ్యాచురేటెడ్ మరియు పాలి అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల పుచ్చకాయ తింటే గుండే పోటు వచ్చే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంచుతుంది.
- పుచ్చకాయ గింజల్లో ( watermelon seeds )యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల గుండె పనతీరు మెరుగుపడుతుంది.
- పుచ్చకాయ గింజల్లో ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది. ఫోలిక్ ఆసిడ్ మన మెదడు పనతీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.
- పుచ్చకాయ గింజల్లో విటమిన్ బి ఉంటుంది. విటమిన్ బి మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా నాడీ వ్యవస్థ ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
- పుచ్చకాయ గింజల్లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా శరీరం ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా కాపాడుతుంది.
- పుచ్చకాయ గింజల్లో ( benefits of watermelon seeds ) విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ ఉంటుంది. ఇవి మీ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ కంటి శుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా కంటి చూపు ని మెరుగుపరుస్తుంది.