Rosemary leaves :
పూదిన కుటుంబానికి చెందిన ఈ రోజ్మెరీ మొక్క తో ( rosemary leaves ) ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. విదేశీ వంటకాల్లో ఈ రోజ్మెరీ మొక్క యొక్క ఆకులని వంటకాల్లో పూదిన ఆకులని బదులు వంటకాల్లో ఈ రోజ్మెరీ మొక్క యొక్క ఆకులని వాడుతారు. ఈ రోజ్మెరీ మొక్క యొక్క ఆకులని బ్రెడ్ , సూప్స్, మసాహరం మరియు సాలడ్స్ తయారీలో ఎక్కువగా వాడుతారు. అంతేకాకుండా దీన్ని హెర్బల్ టీ తయారీలో ఎక్కువగా వాడుతారు. రోజ్మెరీ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.
రోజ్మెరీ మొక్క ఆకులు చర్మ సంబంధిత ప్రొడక్ట్ ల తయారీలో వాడుతారు. అంతేకాకుండా ఈ ఆకుల్ని ( rosemary leaves for hair ) జుట్టు సంబంధిత ప్రొడక్ట్ ల తయారీలో కూడా వాడుతారు. ఇది రాలిపోయే జుట్టుని కాపాడటమే కాకుండా జుట్టు వోత్తుగా మరియు బలంగా పెరుగుతుంది. ఇది చర్మం పై ఉన్న మచ్చలు ( rosemary leaves for skin ) మరియు మొటిమలు పోగొట్టి యవ్వనంగా కనబడేలా చేస్తుంది. ఈ రోజ్మెరీ మొక్క ఆకుల్ని తెంపి ఎండబెట్టి కూడ వాడుతారు. అంతేకాకుండా ఈ రోజ్మెరి కి మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది.
రోజ్మెరీ మొక్క ( dried rosemary leaves ) చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఇది ఎక్కువగా ఇసుక నెలలో పెరుగుతుంది. ఈ రోజ్మెరీ మొక్క పొదలాగా గుంపుగా పెరుగుతుంది. దీంట్లో రెండు రకాల మొక్కలు ఉంటాయి. ఒక మొక్క పొడవుగా తీగ లా పెరుగుతుంది. ఇంకొక రకం మొక్క ( rosemary plant ) పొద లా గుంపుగా పెరుగుతుంది. ఈ రెండింటినీ వంటకాల్లో ఎక్కువగా వాడుతారు. ఈ రోజ్మెరీ మొక్క బూడిద రంగు కొమ్మలు మరియు ఆకులు ఆకుపచ్చటి రంగులో సూదుల్లా ఉంటాయి. ఈ మొక్క దాదాపుగా మూడు అడుగుల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది.
రోజ్మెరీ మొక్క ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు : Rosemary leaves benefits
- రోజ్మెరీ మొక్క ఆకుల్ని చర్మ సౌందర్యానికి ఎక్కువగా వాడుతారు.
- రోజ్మెరీ మొక్క ఆకులు జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా జుట్టు రాలిపోయే సమస్యని కూడ తగ్గిస్తుంది.
- రోజ్మెరీ ఆకులు ఓళ్లు నొప్పులను కూడ తగ్గిస్తాయి.
- రోజ్మెరీ మొక్క ఆకులు మొహంపై ఉన్న మొటిమలను తగ్గించి వాటి ద్వారా ఏర్పడిన మచ్చలను కూడ తొలగిస్తుంది.
- దీన్ని ఎక్కువగా పెర్ఫ్యూమ్ మరియు రూం ఫ్రేష్నర్ లా తయారీలో వాడుతారు.
- రోజ్మెరీ మొక్క ను ఆయుర్వేదం లో ఎక్కువగా వాడుతారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది .
- ఇది కడుపులో మలబద్దకం మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలని తగ్గిస్తుంది.
- రోజ్మెరీ శరీరం లో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- రోజ్మెరీ జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా వొత్తిడిని దూరం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
- రోజ్మెరీ మొహం పై ఉన్న బొంగు మచ్చలు మరియు ముడతలను పోగొడుతుంది.