Basa fish :
బాసా చేప అనడానికి వినడానికి కాస్త వింతగా అనిపించినా తినడానికి మాత్రం ఎంతో రుచిగా ఉంటుంది. అంతే కాదు రుచితో పాటు అధిక పోషక విలువలు కలిగిన చేపల్లో ఇది ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చేపలను తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే మానవ శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు కొన్ని చేపలు తినడం వలన మాత్రమే పొందుతాం కాబట్టి. బాసా చేపలు మెకాంగ్ మరియు చావో ప్రయా బేసిన్లకు చెందినవి. ఈ చేపను అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పేరుతో విక్రయిస్తారు. బాసా చేప శాస్ర్తీయ నామం పంగాసియస్ బోకొర్టీ ఇది క్యాట్ ఫిష్ జాతికి చెందినవిగా పరిగణిస్తారు.
బాసా చేపల్లో అధిక పోషక విలువలు కలిగి ఉన్నట్టు శాస్త్రవేత్తలు పరిశోధనలలో తెలిపారు. బాసా చేపల్లో తక్కువ క్యాలరీలు మరియు అధిక కొవ్వు కలిగి ఉన్నాయి. కాలరీస్ 158 , ప్రొటీన్లు 23 గ్రాములు, ఫాట్స్ 7.5 గ్రాములు , సాచురేటెడ్ ఫ్యాట్ 2 .2 గ్రాములు , కార్బోహడ్రేట్లు 0 , సోడియమ్ 88 ఎంజీ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ 5 గ్రాములు, కొలెస్ట్రాల్ 74 ఎంజీలు కలిగి ఉంటుంది. వీటిని ఎక్కువగా బరువు తగ్గాలి అనుకునే వారు తింటూ ఉంటారు.
బాసా చేప ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పేరుతో పిలుస్తారు తెలుగు రాష్టలలో బాసా చేప ని కెలుతి మీను అని కొందరు బంక జెల్లా అని కొందరు బాసా చేప అని మరికొందరు ఇంటి చేప అని పిలుస్తారు( basa fish in telugu ). తమిళంలో బాసా చేపను కేలుతి మేన్ ( basa fish in Tamil ) అని కన్నడ లో బాసా చేప ని మీను అని ( basa fish in kannada ) హిందీలో బాసా చేప ని ఘారీలు చేప అని ( basa fish in Hindi ) మలయాళంలో బాసా చేపను విట్టిల్లే మత్స్యం ( basa fish in Malayalam ) అని పిలుస్తారు.
బాసా చేప ఉపయోగాలు ( basa fish benifits ) :
- బాసా చేప లో కార్బోహైడ్రేట్స్ ఉండవు మరియు ఎక్కువ ప్రొటీన్లు కలిగి ఉండడం వలన ఈ బాసా చేప బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చేప ని బరువు తగ్గడానికి ప్రయత్నం చేసే వారు ఎక్కువ తింటూ ఉంటారు.
- బాసా చేప తినడం వలన గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడొచ్చు అని డాక్టర్స్ సూచిస్తున్నారు . బాసా చేప లో మంచి కొవ్వు పదార్థాలు కలిగి ఉంటుంది .ఈ కొవ్వు వలన మంచి కొవ్వు రక్తనాళాల్లో పెరిగి చెడు కొవ్వుని తగ్గిస్తుంది.
- బాసా చేప లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన ఈ చేప మెదడు కి ఎంతో మంచిది. కాబట్టి బాసా చేప ని తినడం వల్ల మెదడు ని ఆరోగ్యంగా ఉండి మెమొరి అధికమైతుంది.
- బాసా చేపకి మార్కెట్ లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ధర పలుకుతుంది. ఇండియా లో దీని ధర 200 నుండి 500 మధ్య పలుకుతుంది. ప్రాంతాన్ని బట్టి వాటి ఎగుమతులు బట్టి ఈ ధరలు నిర్ధారిస్తారు.