Balli sastram :
ప్రతీ ఇంట్లో బల్లి కచ్చితంగా ఉంటుంది. ఈ బల్లి ని చూస్తే చాలా మంది భయపడతారు. ఎందుకంటే బల్లి ( balli sastram ) శరీరం పై పడితే చాలా అశుభాలు కలుగుతాయి అని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా స్త్రీలు బల్లి ని చూస్తే చాలా భయపడతారు. నిజంగానే బల్లి ( balli sastram ) శరీరం పై పడితే అశుభాలు కలుగుతాయా? లేదా శుభాలు కూడా ఉంటాయా అని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా బల్లి శరీరం పై పడే చోటును బట్టి శుభమా లేదా అశుభమా అని చెప్పవచ్చు.
ఒకవేళ అనుకోకుండా బల్లి శరీరం పై పడితే అశుభం జరుగుతుందని ఇంట్లో వాళ్ళు చాలా భయపడతారు. అంతేకాకుండా బల్లి ఏ ప్రదేశం లో పడితే ఎం చేయాలని చాలా మందికి తెలియదు. బల్లి శరీరం పై పడితే ఎలాంటి శుభాలు మరియు అశుభాలు జరుగుతాయో గౌలి పఠన శాస్త్రం లేదా బల్లి శాస్త్రం లో ( balli sastram ) చాలా స్పష్టంగా వివరించింది. బల్లి స్త్రీల మీద పడితే పలితం ఒకలా మరియు పురుషుల శరీరంపై పడితే ఒకలా శుభాలు, అశుభాలు కలుగుతాయని గౌలి పఠన శాస్త్రంలో వివరించారు.
బల్లి మీద పడ్డ మరియు శరీరంపై పడిన చాలా శుభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మన పెద్దలు చెబుతుంటారు. పెద్ద బాలశిక్ష లో కూడా బల్లి శాస్త్రం ( balli sastram in telugu ) గురించి తెలియజేశారు. బల్లి చిన్న చిన్న పురుగులు తిని జీవిస్తుంది.అంతేకాకుండా బల్లి ఒక విషపూరితం అయినది. ఇదివరకు బల్లి ఆహరం లో పడి చనిపోయిన వార్తలు మనం చాలా చూశాం. దీన్ని బట్టి మీకు అర్థం అయ్యే ఉంటుంది బల్లి ఎంత విషపూరితమైందో.
పురుషుల పై బల్లి పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.ఎందుకంటే బల్లులు వంట ఇంట్లో ఎక్కువగా ఉంటాయి. వంటింట్లో పురుషులు వుండే సమయం చాలా తక్కువ కాబట్టి పురుషులపై పడే ఛాన్స్ చాలా తక్కువ. ఓకవేళ పడిన ఎలాంటి శుభాలు, అశుభాలు కలుగుతాయో బల్లి శాస్త్రము లో ( balli sastram in telugu ) వివరంగా తెలిపారు.
పురుషుల్లో శరీరం పై ఎక్కడ పడితే శుభం? Balli sastram in telugu for male
పురుషుల శరీర భాగం | శుభం |
ఎడమ భాగం పై వీపు పై పడితే | విజయం కలుగును |
కింద పెదవి మరియు ఎడమ చెవిపై పడితే | ఆదాయం కలుగుతుంది |
మణికట్టు భాగం లో పడితే | అలంకార ప్రాప్తి కలుగుతుంది |
వ్రేళ్ళ పై పడితే | బంధువుల రాక |
పాదాలపై పడితే | అనుకోని ప్రయాణాలు |
ఎడమ కన్ను పై పడితే | అంతా శుభం జరుగుతుంది |
ముఖం పై పడితే | ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి |
పురుషుల్లో శరీరం పై ఎక్కడ పడితే అశుభం?
పురుషుల శరీరభాగం | అశుభం |
పెదవుల మధ్యలో పడితే | మృత్యువు సంభవిస్తుంది |
పైన పెదవి పై పడితే | కలహాలు వస్తాయి |
కుడి చెంప పై పడితే | బాధలు వస్తాయి |
కుడి కన్ను పై పడితే | అన్ని పనుల్లో అపజయాలు |
కుడి వీపు పై పడితే | రాజ భయం కలుగును |
మోచెయ్యి పై పడితే | డబ్బు నష్టం కలుగును |
కుడి భుజం పై పడితే | చాలా కష్టాలు వస్తాయి |
ఎడమ భుజం పై పడితే | అగౌరవం కలుగును |
తొడపై పడితే | వస్త్రాలు నాశనం అవుతాయి |
కాలి వ్రేళ్ళపై పడితే | అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి |
తల మీద పడితే | మరణం వెంటాడుతుంది |
మీసాల పై పడితే | కష్టాలు వస్తాయి |
నుదురు పై పడితే | వేరే సమస్యల్లో చిక్కుకోవడం |
స్త్రీలు ఇంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి బల్లి పడే అవకాశాలు చాలా ఎక్కువ వుంటాయి. ఒకవేళ అనుకోకుండా బల్లి స్త్రీల పై పడితె ఎలాంటి శుభాలు మరియు అశుభాలు కలుగుతాయో బల్లి శాస్త్రము లో తెలియజేశారు.
బల్లి స్త్రీల పై పడితే కలిగే శుభాలు : balli sastram in telugu for female
స్త్రీల శరీరభాగం | శుభం |
భుజం పై మరియు కాలి వేళ్ళ పై పడితే | నగల ప్రాప్తి కలుగుతుంది |
కుడి చెవి మరియు చేతులపై పడితే | ధన లాభం కలుగుతుంది |
కుడి భుజం మరియు తొడలపై పడితే | కామం |
ఎడమ కన్ను పై పడితే | మీ భర్త దగ్గర ప్రేమ పొందుతారు |
కింద పెదవిపై పడితే | కొత్త వస్తువులు వస్తాయి |
మోకాళ్ళపై పడితే | అభిమానం మరియు ఆధరణ |
కుడి చెంప పై పడితే మరియు కాలి వేళ్ళ పై పడితే | మగ శిశువు పుడతాడు |
రొమ్ములపై పడితే | మంచి జరుగును |
కుడి కాలు పై పడితే | శత్రు నాశనం జరుగుతుంది |
పిక్కల పై పడితే | అనుకోకుండా బంధు మిత్రుల రాక |
బల్లి స్త్రీల పై పడితే కలిగే అశుభాలు :
స్త్రీల శరీరభాగం | అశుభం |
రెండు పెదవులపై మరియు చీల మండలం పై పడితే | కష్టాలు కలుగుతాయి |
తలపై పడితే | మరణ భయం |
కొప్పు పై పడితే | రోగాలు వచ్చే సూచన |
కుడి కన్ను పై పడితే | టెన్షన్లు |
వీపు పై పడితే | మరణ వార్త వింటారు |
ఎడమ చెయ్యి పై పడితే | అనవసర వొత్తిడికి లోనవుతారు |
చేయి గోళ్ళ పై పడితే | కలహాలు , గొడవలు వస్తాయి |
బల్లి శరీరముపై పడితే ఏం చేయాలి ?
బల్లి ( balli sastram telugu lo ) మీద పడగానే ఆందోళన చెందకుండా స్నానం చేయండి. సూర్య నమస్కారం చేసి బల్లి దోషం పోవాలని ప్రార్థించండి. స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించి దేవుడిని మీ దోషం పోవాలని ప్రార్థించండి. కంచి కామాక్షి అమ్మవారి గుడిలోని బంగారు బల్లి ని సందర్శించండి. ఒకవేళ మీకు వీలు కాకుంటే ఆ గుడిని సందర్శించిన వాళ్ళ పదాలను మొక్కండి మరియు కంచి కామాక్షి అమ్మవారి చిత్ర పటానికి కానీ లేదా కంచి బంగారు బల్లి చిత్రపటానికి మొక్కడం మంచిది. బల్లి మీద పడితే జరిగే నష్టాలు చాలా ఉంటాయి. బల్లి మీద పడితే ప్రాణ నష్టం , ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దోషం మొత్తం పోవాలంటే కంచి కామాక్షి అమ్మవారి గుడిలోని బంగారు బల్లిని సందర్శించండి. ఎలాంటి బల్లి దోషం అయిన పోతుంది.