Corn silk :
కార్న్ సిల్క్ ( corn silk ) అంటే బహుశా చాలా మందికి తెలీదు. ఎందుకంటే దీన్ని ఎక్కువగా ఎవరు తినడానికి ఇష్టపడరు కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొక్కజొన్న పై ఉండే సన్నటి ధారం లాంటి వే ఈ కార్న్ సిల్క్ ( మొక్కజొన్న పట్టు ) .దీన్ని మొక్కజొన్న పట్టు అని కూడా అంటారు. ఈ మొక్కజొన్న పట్టు చూడటానికి ఫైబర్ దారం లా ఉంటాయి. ఈ మొక్కజొన్న పట్టు లో ఏమీ ఉండవని ఊరికే తీసి పడేయకండి ఎందుకంటే దీంట్లో యాంటి ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
మొక్కజొన్న పట్టు నీ అమెరికన్ వైద్యం లో ఇప్పటికీ వాడుతున్నారు. ఈ మొక్క జొన్న పట్టు తో టీ కూడా చేసుకుని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ మొక్కజొన్న పట్టు టీ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కజొన్న పట్టుని రోజు టీ ( corn silk tea ) చేసుకుని త్రాగడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మరియు కిడ్నీ డిసీజ్ రాకుండా కాపాడుతుంది.
corn silk benefits : కార్న్ సిల్క్ యొక్క ఉపయోగాలు
కార్న్ సిల్క్ లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కావున శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా రక్తంలో షుగర్ శాతాన్ని మరియు బ్లడ్ ప్రెషర్ నీ కూడా తగ్గిస్తుంది. కార్న్ సిల్క్ తినడం వల్ల చర్మ ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
మొక్కజొన్న పట్టు లో చాలా పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న పట్టు లో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మరియు ప్రోటీన్ లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా సోడియం , ఐరన్ , కాల్షియం, జింక్ మరియు పొటాషియం అధికంగా వుంటాయి. మొక్కజొన్న పట్టు తినడం వల్ల రక్తం లో చెడు కొలెస్టిరాల్ స్థాయి ను తగ్గిస్తుంది.
కార్న్ సిల్క్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ నీ మెరుగు పరుస్తుంది.