Rajendra prasad daughter Gayatri passed away :
నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి గారాల పట్టి తన కూతురు గాయత్రి ( 38 ) ( rajendra prasad daughter passed away ) అకస్మాత్తుగా గుండె పోటు తో మరణించారు. నిన్న తనకు కార్డియాక్ అరెస్టు కావడంతో తనని నిన్న హైదరాబాద్ లో నీ ఏఇజి హాస్పిటల్లో జాయిన్ చేసారు. కానీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించారు. గాయత్రి మృతి తో నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు కన్నీరు మున్నీరు అయ్యారు.
గత కొన్ని రోజులుగా గాయత్రి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. చివరకు కార్డియాక్ అరెస్టు కావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేసిన లాభం లేకపోయింది. ఆరోగ్యం ఇంకా క్షీణించడం తో మరణించింది. గాయత్రి కుమార్తె సినిమాల్లో కూడా నటించింది. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాల నటిగా మహానటి చిత్రంలో నటించారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే కూడా తన ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు. అంతేకాకుండా ప్రముఖు సినీ నటులు గాయత్రి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి ని తెలియజేశారు.
గాయత్రి ప్రేమ వివాహం చేసుకోవడం హీరో రాజేంద్ర ప్రసాద్ గారికి అస్సలు నచ్చలేదు. గాయత్రి పెళ్లి తర్వాత రాజేంద్ర ప్రసాద్ మరియు గాయత్రి కి ఇద్దరికీ కొన్ని సంవత్సరాలు మాటలు లేవు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురిని ఇంటికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు పోయి ఇద్దరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. కానీ చివరికి ఇలా గాయత్రి కార్డియాక్ అరెస్ట్ కు గురవతుంది అని ఎవరు ఊహించలేకపోయారు. రాజేంద్రప్రసాద్ గారికి తన కూతురు అంటే చాలా ఇష్టమని పలు ఇంటర్వూ లలో కూడా చెప్పారు.
Also Read : జయం రవి హీరోయిన్ ప్రియాంక మోహన్ నీ పెళ్లి చేసుకున్నాడా ?