Priyanka Mohan :
తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ ( Priyanka mohan behaviour )తన అందంతో చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం హీరోయిన్ ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో ట్రోల్స్ ను ఎదుర్కుంటుంది. ఎందుకంటే దీనికి కారణం ప్రియాంక మోహన్ బిహేవియర్ అని చెప్పుకోవచ్చు. ఒక ఈవెంట్ లో పాల్గొన్న ప్రియాంక మోహన్ నీ తన ఫ్యాన్ ఒక సెల్ఫి అడుగుతాడు దానికి తను ఫేస్ అయిష్టంగా పెట్టి సెల్ఫి కి పోస్ ఇచ్చింది. ఆ తర్వాత వెక్కిరించినట్టుగా ఫేస్ సీరియస్ గా పెడుతుంది. ఇలా ప్రియాంక మోహన్ చేయడం వల్ల తనని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రియాంక మోహన్ కి ( Priyanka mohan arrogant behaviour with fan ) అందం తప్ప తనకు నటన రాదు అని , డ్యాన్స్ కూడా రాదు అని , ఎందుకు తనకు ఇంత బిల్డప్ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంక మోహన్ స్వస్థలం కర్ణాటక , ప్రస్తుతం తను చెన్నై లో నివసిస్తుంది. ప్రియాంక మోహన్ సెల్ఫి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమాలో కి రాకముందు మంచిగా ఉంటూ, కొంత కీర్తి , గుర్తింపు రాగానే వాళ్ళ నిజ స్వరూపం బయటకి వస్తుందని కామెంట్లు చేసారు.
ప్రియాంక మోహన్ బిహేవియర్ ( Priyanka mohan behaviour ) చూసిన ఫ్యాన్స్ కూడా తను ఇలా చేస్తుందని ఊహించలేమని కామెంట్లు చేసారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక మోహన్ తెలుగు లో నటించారు. ప్రియాంక మోహన్ తెలుగు లో నాని సరసన గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ గా నటించారు. తమిళం లో కూడా తను చాలా సినిమాల్లో నటించారు. ప్రియాంక మోహన్ కి శివ కార్తికేయన్ తో నటించిన డాక్టర్ సినిమా వల్ల మంచి పేరు వచ్చింది. శివ కార్తికేయన్ తో తను దాదాపుగా రెండు సినిమాల్లో నటించారు. శివ కార్తికేయన్ తో నటించిన రెండవ సినిమా డాన్ వల్ల కూడా ప్రియాంక మోహన్ కి మంచి పేరు వచ్చింది.