Daavudi video song :
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా ( devara ) నుంచి చిత్ర యూనిట్ ఈరోజు ఒక సాంగ్ ని ( daavudi video song ) రిలీజ్ చేసారు. రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ గా మారింది. చిత్ర యూనిట్ దావుడి అనే సాంగ్ నీ ఈరోజు రిలీజ్ చేశారు. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా డ్యాన్స్ చేసారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ డావుడి సాంగ్ లో తన ఎనర్జిటిక్ స్టెప్ లలో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
జూనియర్ ఎన్టీఆర్ ఏ సాంగ్ లో అయిన సరే చాలా ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తాడు. ప్రేక్షకులను మాత్రం అస్సలు డిస్స్పాయింట్ చేయాడు. యమదొంగ , నాన్నకు ప్రేమతో మరియు టెంపర్ వంటి సినిమాల్లో జూనియర్ తన నటనతోనే కాకుండా డ్యాన్స్ తో కొత్త స్టెప్ లు వేస్తూ ప్రేక్షకులని అలరించాడు. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి గారు ఈ పాటకి సాహిత్యం అందించారు. నకాశ్ అజీజ్ డావుడి పాటని పాడారు.
ఇన్స్టాగ్రం వంటి సోషల్ మీడియా సైట్ లలో ఫ్యాన్స్ రీల్స్ చేయడం మొదలు పెట్టారు. జాహ్నవి కపూర్ కి ఇది తెలుగు లో మొదటి సినిమా. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ దేవర ( devara ) సినిమా కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో చైత్ర రాయ్, బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్, మురళీ కృష్ణ మరియు షైన్ టం తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు రెండు భాగాలుగా రానుంది. ఈ సినిమాని 120 కోట్లతో భారీగా తెరకెక్కిస్తున్నారు.