Seniga chenla nilabadi chethuliyave video song :
ఈ మధ్య కాలం లో సినిమా పాటలకంటే ఎక్కువ క్రేజ్ జానపద పాటలకు ఉంది. ఎక్కువ మంది జానపద పాటలంటే ఇష్టం చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ పాటలని పెళ్ళిల సమయం లో లేదా వేరే ఇతర ఫంక్షన్లలో ఈ పాటలని కచ్చితంగా ప్లే చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక సాంగ్ సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. ఈ సాంగ్ కి ( Seniga chenla nilabadi chethuliyave ) ఇంస్ట్రాగ్రం లో మంచి క్రేజ్ ఉంది అంతేకాకుండా చాలా మంది ఈ సాంగ్ కి రీల్స్ కూడా చేసారు..
జాను లైరి అంటే బహుశా తెలియని వారు ఎవరు ఉండరేమో ఈ తెలుగు రాష్ట్రాల్లో అంతేకాకుండా తను చేసిన చాలా సాంగ్స్ ఇది వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మధ్య డీ అనే ఈటీవీ లో ప్రసారం అయ్యే డ్యాన్స్ షో లో కూడా జాను లైరి ఈ సాంగ్ పై డ్యాన్స్ కూడా చేశారు. మగవాళ్ళకి ఏ మాత్రం తీసిపోకుండా చాలా ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తుంది. జాను లైరి డ్యాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈమె చేసిన సాంగ్స్ చాలా వరకు హిట్ అయ్యాయి.
ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతున్న సెనిగ చెన్ల నిలబడి సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. దీన్ని ఎక్కువగా Dj సాంగ్ గా కూడా వాడుతున్నారు. ఈ సాంగ్ లో జాను లైరి మరియు రాజేష్ చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. రాజేష్ చూడటానికి బొద్దుగా ఉన్న ఎవరు ఊహించనంతగా చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. ఈ సాంగ్ కి శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేసారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్ లో 35 M వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ సాంగ్ నీ సంతోష్ యాదవ్ నిర్మించారు అంతేకాకుండా మ్యూజిక్ ను వెంకట్ అజ్మీరా అందించారు .
Seniga chenla nilabadi chethuliyave video song :