Besan flour :
శనిగ పిండి ని ( besan flour ) వంటకాల్లో మాత్రం ఎక్కువగా వాడుతుంటాం. దీని వల్ల కలిగే ఉపయోగాలు మీకు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. శనిగ పిండి తో వివిధ రకాల వంటకాలు చేస్తారు. అంతేకాకుండా వీటితో చాలా రకాల స్వీట్లు కూడా తయారు చేస్తారు. అందరు ఎంతో ఇష్టం గా తినే మిర్చి బజ్జీ …ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. దీన్ని వంటకాల్లో నే కాకుండా ఆయుర్వేద ప్రొడక్ట్ లలో మరియు చర్మ సౌందర్యానికి ఎక్కువగా వాడుతుంటారు . అంతేకాకుండా జుట్టు ఒత్తుగా మరియు బలంగా పెరగటానికి కూడా దీన్ని వాడుతారు.
శనిగ పిండిని ( besan flour in telugu ) మన దేశం లోనే కాకుండా పాకిస్తాన్ , బంగ్లాదేశ్ , నేపాల్ మరియు శ్రీలంక వంటి దేశాల్లో ఎక్కువగా ఈ పిండిని వంటకాల్లో వాడుతారు. మన భారత దేశం లో ఈ పిండి తో బజ్జీలు , బొండ, బోంది, లడ్డూలు , మైసూర్ పాక్, అప్పడాలు మరియు పకోడీ వంటి వివిధ రకాల పదార్థాల తయారీలో దీన్ని ఎక్కువగా వాడుతారు.
శనిగ పిండి తో ఆరోగ్య ప్రయోజనాలు : health benefits of besan flour
ఇంట్లో సహజంగా దొరికే శనిగ పిండి తో వివిధ రకాల చర్మ సంబంధితమైన సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖం పై ఏర్పడిన మచ్చలను మరియు అక్నే ను పోగొట్టవచ్చు.
అంతేకాకుండా జిడ్డు చర్మం తో బాధపడేవారు కూడా శనిగ పిండి నీ మొహానికి పట్టిస్తే జిడ్డు పోయి మొహం కాంతివంతంగా తయారవుతుంది.
శనిగ పిండి లో గ్లుటెన్ అనే ప్రోటీన్ ఉండదు. గ్లూటేన్ ఒక చెడు ప్రోటీన్. కాబట్టి శనిగ పిండిలో ఈ ప్రోటీన్ ఉండదు కాబట్టి దీనితో చేసే పదార్థాలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
శనిగ పిండితో చేసే పదార్థాలు తినడం వల్ల కార్డియో వ్యాస్కులర్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
శనిగ పిండిలో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. శనిగ పిండి తో చేసిన పదార్థాలు తినడం వల్ల కండరాలు దృఢంగా అవుతాయి. అంతేకాకుండా కొలెస్టిరాల్ ను కూడా తగ్గిస్తుంది.