Quinoa in telugu :
అత్యధిక పోషకాలు విలువలు ఆహారాలలో క్వినోవా ( Quinoa ) ఒకటి. క్వినోవా లో మన శరీరానికి కావాల్సిన చాలా పోషక విలువలు ఉంటాయి. అందుకే వీటిని రైస్ కి బదులుగా ఎక్కువగా తింటారు. క్వినోవా ను ( Quinoa in telugu ) ఎక్కువగా బొలీవియాలో ఎక్కువగా పండిస్తారు. అంతేకాదు ఈ క్వినోవా పంటని బొలివియాలో బంగారు పంట అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీంట్లో అత్యధిక పోషకాలు ఉంటాయి కాబట్టి దీన్ని బంగారు పంట అని అంటారు. ఈ మధ్య కాలంలో దీన్ని ఎక్కువగా తింటున్నారు.
క్వినోవా లో ( quinoa in telugu ) గ్లూటెన్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఉబకాయయం , మధుమేహ వంటి వ్యాధులు మన దరి చేరకుండా కాపాడుతుంది. అంతేకాకుండా వీటిలో గోధుమల కన్న ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. అందుకే వీటిని ప్రొద్దున బ్రేక్ ఫాస్ట్ గా ఎక్కువగా తీసుకుంటారు. ఈ క్వినోవా తో చాలా రకాల వంటలు కూడా చేస్తారు. అంతేకాకుండా క్వినోవా తో బిస్కట్లు, సలాడ్ లు, బ్రెడ్ , బిర్యానీ మరియు కిచిడి వంటి వాటిని తయారు చేస్తారు.
క్వినోవా లో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. క్వినోవా లో ( quinoa in telugu ) కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ , పాస్పరస్, పొటాషియం, జింక్ , కొవ్వు , పిండి పదార్థం , పోటీన్లు మరియు దాదాపుగా 300 కి పైగా కేలరీలు ఉంటాయి. వీటిని రోజు తినడం వల్ల ఊబకాయం తో బాధపడుతున్నవారు చాలా తొందరగా బరువు తగ్గుతారు. అందుకే రోజు వీటిని మీ డైట్ ప్లాన్ లో చేర్చుకోండి.
క్వినోవా తో ఆరోగ్య ప్రయోజనాలు : Quinoa benefits
- క్వినోవా ను రోజు ప్రొద్దున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే దీంట్లో బరువు ను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. క్వినోవా నీ తీసుకోవడం వల్ల రోజు బరువు చాలా త్వరగా తగ్గుతారు.
- డయాబెటిక్ పేషంట్స్ ఈ క్వినోవా ను తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే క్వినోవా ను తీసుకోవడం వల్ల రక్తంలో ను షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అందుకే దీన్ని ఎక్కువగా డయాబెటిక్ పేషంట్స్ ప్రొద్దున అల్పాహారంగా తీసుకుంటారు.
- క్వినోవా తీసుకోవడం వల్ల నిద్ర లేమి తనం తో బాధపడుతున్న వారికి చక్కటి ఉపశమనం లభిస్తుంది.
- క్వినోవా తీసుకోవడం వల్ల రక్త హీనత కూడా తగ్గుతుంది. అంతేకాకుండా కండరాల నొప్పి మరియు తల నొప్పి ని కూడా తగ్గిస్తుంది.