HomeHealthPCOD diet chart : పీసీఓడీ తో బాధపడేవారు ఈ డైట్ ను ఫాలో అవ్వండి

PCOD diet chart : పీసీఓడీ తో బాధపడేవారు ఈ డైట్ ను ఫాలో అవ్వండి

PCOD diet chart :

PCOD తో ( pcod diet chart ) బాధ పడే చాలా మంది ఆడవారు పీసీఓడీ వచ్చిన వెంటనే ఎలా తగ్గించుకోవాలి అని బాధపడుతూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పీసీఓడీ నీ ఆహారపు అలవాట్లతో తగ్గించుకోవచ్చని. ప్రతి ఒక్కరూ పీసీఓడీ తో బాధపడే వారు గుర్తుపెట్టుకోవాల్సిన నియమం తినే ఆహారంలో కార్బో హైడ్రేట్ తక్కువ ఉంది ప్రోటీన్ మరియు ఎక్కువ గా ఉండేలా చూసుకోవాలి మరియు ఫాట్స్ తగినంత తీసుకుంటే సరిపోతుంది. మనం తినే ఆహారంలో రెండు రకాల కార్బొ హైడ్రేట్ ఉంటాయి ఒకటి కంప్లెక్స్ రెండవవి సింపుల్ కార్బోహైడ్రేడ్స్.

సింపుల్ కార్బోహైడ్రేట్స్ లో ( pcod diet chart ) అధిక శాతం చక్కర కొద్ది శాతం ఫైబర్ ఉంటుంది. కంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లో తక్కువ శాతం చక్కెర ఎక్కువ శాతం ఫైబర్ తో కూడి ఉంటాయి కాబట్టి పీసీఓడీ డైట్ లో ఉన్న వారు కంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం మంచిది.
ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి డైట్ నీ ఫాలో అవ్వాలని చూస్తారు కానీ వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది తెలియకపోవచ్చు కాబట్టి పీసీఓడీ తో బాధపడే వారు ఎలాంటి డైట్ నీ పాటిస్తే పీసీఓడీ నీ తగ్గించుకోవచ్చు అనేది నేను చెప్తాను….

Pcod diet chart in telugu

Pcod Diet Chart :

ఆదివారం:
హెర్బల్ టీ:దాల్చిన చెక్క టీ
బ్రేక్ ఫాస్ట్:చియా పుడ్డింగ్ మరియు ఔట్స్
స్నాక్:ఒక ఆపిల్
లంచ్:వెజిటబుల్ సలాడ్
స్నాక్:
డిన్నర్:అన్ని రకాల ధాన్యాలతో చేసిన పుల్క్ మరియు బెండకాయ వేపుడు

సోమవారం:
హెర్బల్ టీ : మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే టీ లా తీసుకోవాలి.
బ్రేక్ ఫాస్ట్:రాగి దోశ విత్ కొబ్బరి చట్నీ
స్నాక్:బొప్పాయి ముక్కలు ఒక కప్పు
లంచ్:బ్రౌన్ రైస్ విత్ పప్పు మరియు వెజిటబుల్ కర్రీ
స్నాక్:వేయించిన శనిగలు
డిన్నర్:రెండు పుల్కాలు విత్ చికెన్

మంగళవారం:
హెర్బల్ టీ:గ్రీన్ టీ
బ్రేక్ ఫాస్ట్:రాగి ఇడ్లీ విత్ టొమాటో చట్నీ
స్నాక్:నారింజ పండు
లంచ్:బ్రౌన్ రైస్ విత్ చికెన్ కర్రీ
స్నాక్:మొలకలు
డిన్నర్:రెండు పుల్కాలు విత్ పన్నీర్ కర్రీ

బుధవారం:
హెర్బల్ టీ: దాల్చిన చెక్క టీ
బ్రేక్ ఫాస్ట్:ఓట్స్ ఉప్మా
స్నాక్: ఆల్మండ్స్
లంచ్:వెజిటబుల్ సలాడ్
స్నాక్:బెర్రీస్
డిన్నర్:రెండు పుల్కాలు విత్ అన్ని రకాల కూరగాయల కర్రీ

గురువారం:
హెర్బల్ టీ:జింజర్ టీ
బ్రేక్ ఫాస్ట్: పోహ విత్ వెజిటబుల్స్
స్నాక్:కొన్ని ఖర్జూరాలు
లంచ్:బ్రౌన్ రైస్ విత్ టిక్కా
స్నాక్: మామిడి పండు
డిన్నర్: రెండు పుల్కాలు విత్

శుక్రవారం:
హెర్బల్ టీ:ధనియాల టీ
బ్రేక్ ఫాస్ట్:రెండు ఉడకపెట్టిన గుడ్లు లేదా డబుల్ ఎగ్ ఆమ్లెట్
స్నాక్:జామ కాయ ఒకటి
లంచ్:బ్రౌన్ రైస్ విత్ చికెన్ కర్రీ
స్నాక్:కొన్ని జీడి పప్పులు
డిన్నర్:రెండు పుల్కాలు విత్ వెజిటబుల్ కర్రీ

శనివారం:
హెర్బల్ టీ: లెమన్ గ్రాస్ టీ
బ్రేక్ ఫాస్ట్:రాగి మాల్ట్
స్నాక్:దానిమ్మ గింజలు ఒక కప్పు
లంచ్:వెజిటబుల్ సలాడ్
స్నాక్: వేయించిన జీడిపప్పు
డిన్నర్:రెండు పుల్కాలు విత్ పన్నీర్ కర్రీ

RELATED ARTICLES
LATEST ARTICLES