Difference between pcos and pcod :
PCOS లేదా PCOD అనే సమస్యలని ఈ మధ్య కాలంలో తరుచుగా వింటున్నారు. అసలు PCOS మరియు PCOD ( difference between pcos and pcod ) అంటే ఏమిటో కొందరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే కొందరు మీకు సమస్య ఉంది అని చెప్పినప్పుడు అదే తగ్గిపోతుందని బ్రమలో ఉండి సమస్యని పెద్దది చేసుకుంటారు. ఈ పిసిఓఎస్ మరియు పిసిఓడి సమస్యల గురించి ప్రతి ఆడవారికి అవగాహన ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ ఉరుకులపరుగుల జీవన శైలిలో అడవారు తమ గురించి తాము పట్టించుకోకుండా ఉంటున్నారు. కొందరికి అయితే అసలు పిసిఓడి మరియు పిసిఓఎస్ వచ్చిందని కూడా తెలియదు.
కొంత మంది ఆడవారిలో కొన్ని లక్షణాల వలన పిసిఓడి మరియు పిసిఓఎస్ సమస్యలు బయటపడుతాయి. మరి కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండా చేయవలసిన నష్టాన్ని చేసేస్తాయి.చాలా మంది ఆడవారు పిసిఓఎస్ మరియు పిసిఓడి సమస్యలు రెండు ఒకటిగానే అనుకుంటారు కానీ పిసిఓఎస్ వేరు పిసిఓడి వేరని తెలియదు. అయితే రెండు వేరు వేరు సమస్యలు అయిన ఏ సమస్యలు రావడానికి గల ముఖ్య కారణం మాత్రం జీవన శైలి మరియు తీసుకునే ఆహారాలు మాత్రమే మరి కొందరిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చని డాక్టర్స్ చెబుతున్నారు.
PCOS మరియు PCOD మధ్య తేడా difference between PCOS and PCOD :
పిసిఓఎస్ ( PCOS ):
PCOS అంటే పొలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. ఆడవారి అండాశయంలో ఒకటి కంటే ఎక్కువ నీటి బుడగలు మరియు వీటితో పాటుగా మధుమేహం కానీ ఇన్సులిన్ నిరోధకత కానీ ఉంటే అప్పుడు ఆ సమస్య నీ పిసిఓఎస్ గా చెప్తారు. ముఖ్యంగా ఈ PCOS అనేది అధిక బరువుతో బాధపడే వారిలో కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా PCOS ఏందుకు వస్తుందో అధ్యయనాలు జరుగుతున్న కూడా కారణాలు మాత్రం తెలియవు. కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది ఏంటంటే అధిక బరువు ఉన్నవారిలో అండ్రోజన్లు ఎక్కువ విడదల కావడం వలన ఈ సమస్య వస్తుందని వెల్లడించారు. పిసిఓఎస్ వచ్చినపుడు ఆడవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
వాటిలో..
1.నెలసరి సరిగా రాకపోవడం మరియు ఒక నెలలో రెండు సార్లు నెలసరి రావడం.
2.తల ముందు భాగంలో ఉన్న వెంట్రుకలు ఊడిపోవడం. మరియు ఒకే దగ్గర ఒక గుండంలా వెంట్రుకలు రాలిపోవడం.
3.అవాంఛిత రోమాలు రావడం.
4.అధికంగా బరువు పెరగడం.
5.PCOS ఉన్నవారిలో మధుమేహం కూడా బయటపడుతుంది.
6.మొహం మీద మొటిమలు మచ్చలు మరియు ఆక్నీ తో బాధపడుతుంటారు.
ఇవి PCOS లక్షణాలు.
పిసిఓడి ( PCOD ):
PCOD అంటే పోలిసిస్టిక్ ఓవరీ డీసీజ్ దాని అర్థం అడవారి అండశయాలలో నీటి బుడగలు ఏర్పడడం. ఈ నీటి బుడగలు ఆడవారిలో అండ్రోజన్లు ఎక్కువ ఉత్పత్తి కావడం వలన ఏర్పడుతాయి.ఈ PCOD ఎక్కువగా అధిక బరువు ఉన్నవారిలో కనపడుతుంది. పిసిఓడి వచ్చిన వారిలో నీటి బుడగలు మాత్రమే ఉంటాయి. కానీ PCOS వచ్చిన వారిలో నీటి బుడగలతో పాటుగా ఇతర సమస్యలు కూడా ఉంటాయి. పిసిఓడి సమస్యతో బాధపడే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో…
1.నెలసరి సమయానికి రాకుండా కొన్ని నెలల పాటు ఆగిపోవడం. కొందరిలో సంవత్సరాలు కూడా రాకుండా ఉండడటం.
2.పిసిఓఎస్ లో చూసినట్టుగా పిసిఓడి లో కూడా అవాంఛిత రోమాలు బాధిస్తాయి.
3.జుట్టు రాలిపోవడం.
4.తక్కువ ఆహారాన్ని తీసుకున్న కూడా బరువు పెరుగుతూ ఉండటం.
5.మొహం పై మొటిమలు రావడం.