Betel leaf :
మన దేశంలో తమలపాకులను ( betel leaf ) ఎక్కువగా తింటుంటారు. తమలపాకుల ను భోజనం చేసిన తర్వాత పాన్ రూపం లో ఎక్కువగా తీసుకుంటారు. దీన్ని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. అంతే కాకుండా పండగ సమయం లో మరియు ఫంక్షన్ లల్లో ఈ తమలపాకుల ని ( betel leaf ) ఎక్కువగా వాడుతారు. పూజ సమయం లో తమలపాకుల ని దేవతలకి మరియు దేవుళ్ళకి సమర్పిస్తారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి కి ఈ తమలపాకుల ని మాల గా కుచ్చి దేవుడికి సమర్పిస్తారు. ఇలా తమలపాకుల ని పూజలకు కూడా వాడుతారు. భోజనం తర్వాత తినే పాన్ కి ( betel leaf paan ) భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినా కూడా చాలా మంది వీటిని తింటారు.
తమలపాకు పైపెరేసి కుటుంబానికి చెందిన తీగ మొక్క ఇది ( betel leaf plant ) ఇది తీగ రూపంలో మాత్రమే పెరుగుతుంది. తీగ నుండి ఆకులు పెరుగుతాయి. పెరిగిన ఆకులని తెంపి మార్కెట్ లో విక్రయిస్తారు. వీటికి మార్కెట్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ ఆకులు ముదరక ముందే తెంపాలి లేదంటే వీటిని విరిస్తే ఊరికే విరిగిపోతాయి. లేత ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడే వీటిని కోయాలి. తమలపాకుల రుచి కూడా కొంచం ఘాటు గానే ఉంటుంది. అందుకే దీంట్లో స్వీట్ ని కూడా కలిపి పాన్ గా తీసుకుంటారు. కానీ ఇది తిన్న తర్వాత నోరంతా ఎర్రగా అవుతుంది. ఇది పోవడానికి కాస్త సమయం పడుతుంది.
తెలుగులో వీటిని తమలపాకు అని అంటారు. హిందీలో వీటిని పాన్ కా పాఠ అని ( paan ka patta ) , మలయాళం లో వట్ల , తమిళంలో వెతలపాకు అని పిలుస్తారు. తమలపాకుల ని మన దేశంలో పురాతన కాలం నుంచి ఎన్నో ఆయుర్వేద మందుల తయారీలో మరియు చికిత్స లలో వాడుతున్నారు. అంతేకాకుండా చైనా దేశం లో కూడా ఈ తమలపాకుల ని ఎన్నో వ్యాధుల నివారణకు కి కూడా వాడుతున్నారు. పూర్వకాలంలో తమలపాకును అరక కాయతో నమిలేవారు.
Neutrient values in betel leaf : తమలపాకుల లో పోషక విలువలు
తమలపాకులు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి గుండె ఆకారంలో ఉంటాయి. వీటిని ఎక్కువగా భారతదేశంలో , శ్రీలంక , ఇండోనేషియా మరియు మలేషియా దేశాల్లో ఎక్కువగా లభిస్తుంది. తమలపాకుల లో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, ఫైబర్ , ఖనిజాలు , కొంచం ఆయిల్ మరియు ఎక్కువగా నీటి శాతం ఉంటుంది.
betel leaf online : betel leaf price
తమలపాకులకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది వీటి ధర. అయిదు తమలపాకుల కి మార్కెట్ లో 14 రూపాయల ధర పలుకుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీటికి మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో.
betel leaf benefits : తమలపాకులతో ఆరోగ్య ప్రయోజనాలు
- తీవ్ర తల నొప్పితో బాధపడేవారికి తమలపాకు ఒక చక్కటి పరిష్కారం. తమలపాకు కి అనల్జేసిక్ గుణాలు ఉన్నాయి. తమలపాకు తినడం వల్ల తల నొప్పి తగ్గుతుంది.
- మలబద్దకం సమస్యతో బాధపడుతున్నవారు ఈ తమలపాకు ని తింటే మంచి ఫలితం ఉంటుంది. తమలపాకు తినడం వల్ల మలబద్దక సమస్య తగ్గడమే కాకుండా కడుపు నొప్పి ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో సాధారణ PH స్థాయిలను పునరిధ్ధరిస్తుంది.
- దగ్గు మరియు జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు తమలపాకు తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఛాతీ నొప్పి మరియు ఆస్తమా వంటి సమస్యతో బాధపడుతున్నవారికి తమలపాకు చక్కటి పరిష్కారం.
- తమలపాకు లో పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా ఇది మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా తమలపాకు ని అర్కిటిస్ మరియు అర్థరైటిస్ చికిత్స నివారణకు దీనిని వాడుతారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ అయిన చోట తమలపాకు ని రాస్తే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
- తమలపాకులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. తమలపాకు ని పాన్ రూపంలో తీసుకుంటారు. అప్పుడు మన నోట్లో ఉన్న దుర్వాసనను ఇది పోగొట్టడమే కాకుండా నోట్లో ఉన్న అనేక రకాల బ్యాక్తిరీయలని చంపుతుంది.
- తమలపాకు ను తినడం వల్ల దంత సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా చిగుళ్ల నొప్పి, వాపులు , పంటి నొప్పి వంటి సమస్యలని తగ్గిస్తుంది. దుర్వాసనను పోగొడుతుంది.
- షుగర్ పేషంట్స్ తమలపాకు ని తినడం ఎంతో మంచిది. తమలపాకు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ పేషంట్స్ తినడం మంచిది.
- తమలపాకు కి యాంటీ యాక్సిడెంట్ , యాంటీ మ్యుటాజెనిక్ మరియు యాంటీ ప్రోలిపరేటివ్ లక్షణాలు ఉంటాయి.ఇవి క్యాన్సర్ తో పోరాడుతాయి.
- తమలపాకు ని రాత్రి భోజనం చేసిన వెంటనే తీసుకుంటారు. ఎందుకంటే ఇది జీవక్రియ రేటు ని పెంచుతుంది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా శరీరం లో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది.