Rudraksha bracelet :
రుద్రాక్ష బ్రాస్లెట్ ని ( rudraksha bracelet ) ధరించటం చాలా మంచిది అని పూర్వ కాలం నుంచి ఋషులు మరియు పండితులు చెబుతున్నారు. రుద్రాక్షలు ఎతైన ప్రదేశాలలో మరియు మంచు ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రుద్రాక్ష చెట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అందుకే మార్కెట్ లో రుద్రాక్షలకి చాలా డిమాండ్ ఎక్కువ. రుద్రాక్షల లో కూడా చాలా రకాలు ఉన్నాయి. రుద్రాక్షలు కొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి . ఎందుకంటే మార్కెట్ లో చాలా మంది నకిలీ రుద్రాక్షలు అమ్ముతారు. అందుకే కొనే ముందు చూసి జాగ్రత్తగా తీసుకోవాలి.
హిందువులు రుద్రాక్షను శివుడి ప్రతిరూపంగా కొలుస్తారు. అందుకే ఎక్కువగా వీటిని ధరిస్తారు. రుద్రాక్షను ధరించడం మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొందరు రుద్రాక్షలను మాల లాగా మెడలో ధరిస్తారు. మరికొందరు రుద్రాక్షలను ( silver rudraksha bracelet ) తమ చేతికి ధరిస్తారు. ఒకవేళ రుద్రాక్షలను ధరిస్తే చాలా నియమాలను పాటించాల్సి ఉంటుంది. మార్కెట్ లో మనకి చాలా రకాల రుద్రాక్ష బ్రాస్లెట్ లు అందుబాటులో ఉన్నాయి. రుద్రాక్ష లో ఏకముఖి నుంచి14 ముఖాల రుద్రాక్షల వరకు ఉంటాయి. వాళ్ళ వాళ్ళ రాషులని బట్టి లేదా జాతకాలను బట్టి ఈ రుద్రాక్ష బ్రాస్లెట్ ని ధరిస్తారు.
పురాణాల ప్రకారం రుద్రాక్షల గురించి ఒక కథ ఉంది. శివుడు ఒకరోజు ధ్యాన స్థితి లోకి వెళ్ళాడు. ధ్యాన స్థితి లోకి వెళ్ళిన శివుడు ఎన్ని శతాబ్దాలు గడిచినా ధ్యానం నుంచి రావట్లేడు. ఇలా ధ్యాన స్థితిలో ఉన్న శివుడి కళ్ళ నుంచి కన్నీళ్లు భూమి పై పడి రుద్రాక్షలు గా మారాయి అని చెబుతుంటారు. రుద్రాక్షలను ( rudraksha bracelet for men ) ధరిస్తే చాలా లాభాలు ఉన్నాయి. రుద్రాక్షలను ధరించడం వల్ల ఐశ్వర్యం వస్తుంది. అంతేకాకుండా పేదరికం తొలగిపోతుంది. రుద్రాక్షలను ధరించడం ద్వారా సంఘంలో గౌరవం పెరుగుతుంది. రుద్రాక్షలను ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.