Litchi fruit in telugu :
వేసవిలో కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో లీచీ పండ్లు ( litchi fruit in telugu ) ఒకటి. వేసవిలో కాలంలో మామిడి పండు ఏవిధంగా అయితే ఎక్కువగా కనిపిస్తాయో అలాగే లీచీ పండ్లు కూడా మార్కెట్ లో అదేవిధంగా కనిపిస్తాయి. ఈ లీచీ పండ్లు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల అరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లీచీ పండ్లు అచ్చం స్ట్రాబెర్రీ లా ఎర్రగా , నిగ నిగలాడుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్ పక్కన అమ్ముతున్నారు. అయితే ఈ లీచీ పండ్ల గురించి చాలా మందికి తెలియదు.
ఈ పండ్లు ఎక్కువగా చైనా దేశం లో పండుతాయి. డాక్టర్లు సైతం వీటిని తినమని చెబుతుంటారు. ఈ పండ్లలో చాలా పోషక విలువలు ఉంటాయి. కానీ వీటిని మితంగా మాత్రమె తినాలి. ఈ పండు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, ఎక్కువ తింటే చాలా దుష్ఫలితాలు కలుగుతాయి. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే అవకాశం కుడా ఉంటుంది.
లీచీ పండ్లు ( litchi fruit in telugu ) ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. ఇవి తీపి రుచి ని కలిగి ఉంటాయి. లీచీ పండ్లని ఐస్ క్రీమ్ మరియు జ్యూస్ తయారీలో ఎక్కువగా వాడుతారు. అంతేకాకుండా జెల్లీ తయారీలో కూడా వాడుతారు. లీచీ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవిలో కాలంలో తప్పకుండా తీసుకోవాలి. ఈ లీచీ పండ్లు ఎక్కువగా సూపర్ మార్కెట్ లో నే కాకుండా , ఆన్లైన్ లో కూడా ఎక్కువగా లభిస్తాయి.
లీచీ పండ్లలో పోషక విలువలు : Nutrients Values in Litchi fruit in telugu
లీచీ పండ్లలో నీటి శాతం మరియు పిండి పదార్థం ఉంటుంది. లీచీ పండ్లలో చక్కెర మరియు ఫైబర్ ఉంటాయి. అంతేకాకుండా లీచీ పండ్ల లో విటమిన్ సి, మెగ్నీషియం, మాంగనీస్ , రాగి, విటమిన్ బి 6 , ఫోలేట్ మరియు పొటాషియం అదికంగా ఉంటాయి. లీచీ పండ్ల లో ఎపికేటేచిన్ మరియు రుటిన్ అనే యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో మేలు చేస్తాయి.
లీచీ పండ్ల తో ఆరోగ్య ప్రయోజనాలు : Health benefits of Litchi fruit in telugu
1.లీచీ పండ్లలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది జీర్ణ క్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా మలబద్దక సమస్యని తగ్గిస్తుంది.
2.లీచీ పండ్ల లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మన శరీరములో రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది.
3.లీచీ పండ్ల లో ఎక్కువగా నీరు శాతం మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మనం ఉబకాయం బారిన పడకుండా కాపాడుతుంది.
4.లీచీ పండ్ల లో ఐరన్ , కాపర్, మాంగనీస్ మరియు పొటాషియం పుష్కళంగా వుంటాయి కాబట్టి ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.
5.లీచీ పండ్లలో అనేక రకాల యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గుండె జబ్బులు మరియు దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
6.చాలా మంది యువత జుట్టు రాలిపోయే సమస్య తో బాధపడుతుంటారు. లీచీ పండ్ల లో ఉండే రాగి జుట్టు రాలిపోయే సమస్య ని తగ్గిస్తుంది.
7.లీచీ పండ్లని తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే లీచీ పండ్లు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. రక్తం లో ఒకేసారి చక్కెర స్థాయిని పెంచకుండా చూస్తుంది.
8.అధిక రక్తపోటు తో బాధపడుతున్నవారు లీచీ పండ్లని తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది.
9.చర్మంపై ముడతలు , మచ్చలు మరియు మొటిమలు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు లీచీ పండ్ల ని తింటే చర్మ సమస్యలు తగ్గి , నిగారింపు వస్తుంది.
10.జ్వరం , జలుబు మరియు గొంతు నొప్పి తో బాధపడేవారు లీచీ పండ్ల ని తింటే చక్కటి ఫలితం ఉంటుంది.