Malta Fruit :
మాల్టా ఫ్రూట్ ( Malta fruit ) అంటే మన భారత దేశం లో చాలా మందికి తెలియదు. ఎందుకంటే మన దేశం లో కూడా మార్కెట్ లో చాలా తక్కువ చూస్తాం. మాల్టా ఫ్రూట్ అచ్చం నారింజ పండుల ఉంటుంది. కానీ లోపలి భాగం ఎరుపు రంగు లో ఉంటుంది. కానీ చూడటానికి మాత్రం పైన భాగం నారింజ పండు లా ఉంటుంది. ఇవి ఎక్కువగా చల్లటి ప్రదేశంలో మరియు ఎత్తైన ప్రాంతాలలో పెరుగుతాయి. మన భారతదేశంలో మాల్టా ఫ్రూట్ ని ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో పెరుగుతాయి.
మాల్టా ఫ్రూట్ తో ( Malta fruit ) స్వాశ్ మరియు క్యాండీ తయారీలో దీన్ని వాడుతారు. మాల్టా ఫ్రూట్ కూడా అచ్చం నారింజ పండు లాగే ఉంటుంది మరియు విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా దీని రుచి నారింజ పండు కంటే రుచిగా ఉంటుంది. బ్రిటిష్ వారు ఈ పండుని మాల్టీస్ ఆరంజ్ అని పిలిచేవారు. మార్కెట్ లో కూడా ఈ పండు చాలా విరివిగా దొరుకుతుంది.
మాల్టా ఫ్రూట్ లో పోషక విలువలు : Neutrients values in Malta fruit
మాల్టా ఫ్రూట్ లో మన శరీరానికి కావల్సిన విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మాల్టా ఫ్రూట్ ని ఎంతో ఇష్టంగా తింటారు. మాల్టా ఫ్రూట్ ని ఎక్కువగా జ్యూస్ రూపంలో తీసుకుంటారు. మాల్టా ఫ్రూట్ లో విటమిన్ సి, ఐరన్ , విటమిన్ బి 6 , మెగ్నీషియం మరియు పొటాషియం ఉంటాయి. అంతేకాకుండా మాల్టా ఫ్రూట్ లో యాంటి ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి.
మాల్టా ఫ్రూట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు : health benefits of Malta fruit
1.మాల్టా ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరములో రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. అందుకే విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మాల్టా ఫ్రూట్ ని తీసుకుంటారు.
2.మాల్టా ఫ్రూట్ లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది మన కంటి చూపు మెరుగు పడటానికి ఉపయోగపడుతుంది. కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు మాల్టా ఫ్రూట్ ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
3.మారుతున్న ఆహారపు అలవాట్ల వలన చాలా మంది మలబద్దక సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు మాల్టా ఫ్రూట్ ని తీసుకుంటే మలబద్దక సమస్య తగ్గుతుంది.
4.మాల్టా ఫ్రూట్ తినడం వల్ల రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే మాల్టా ఫ్రూట్ లో హెస్పిరిడిన్ మరియు మెగ్నీషియం ఉంటుంది. అందుకే దీనివల్ల రక్త పోటు నియంత్రణలో ఉంటుంది.
5.మాల్టా ఫ్రూట్ లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరము లో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ భారిన పడకుండా కాపాడుతుంది.
6.మాల్టా ఫ్రూట్ మన శరీరము లోని చెడు LDL cholesterol స్థాయి ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మన శరీరానికి ఉపయోగపడే HDL cholesterol స్థాయిని ని పెంచుతుంది.