Virupaksha movie review :
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ” విరూపాక్ష ” ( virupaksha movie review ) సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ( april 21, 2023 ) విడుదల అయ్యింది. ఈ సినిమా లో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాకి దండు కార్తిక్ దర్శకత్వం వహించాడు. ఇదివరకు దండు కార్తిక్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర పని చేశాడు. ఈ సినిమా ద్వారా దండు కార్తిక్ దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయం అయ్యాడు. అంతేకాకుండా ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే ని అందించాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో. ఈ సినిమాకి అంజనేష్ లోకనాత్ మ్యూజిక్ ని అందించాడు. ఈ సినిమా ని బివిఎస్ఎన్ ప్రసాద్, శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మించాడు.
మొట్ట మొదటి సారిగా సాయి ధరమ్ తేజ్ ఒక విలేజ్ బ్యాగ్రౌండ్ హర్రర్ సినిమా లో ( virupaksha movie review ) నటించాడు. ఇది వరకు సాయి ధరమ్ తేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు మరియు లవ్ స్టోరీ సినిమాలు మాత్రమే చేశారు. అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. విరూపాక్ష సినిమా ట్రెయిలర్ విడుదల అయినప్పటి నుంచి ఈ సినిమా పై ఒక్కసారిగా ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నంత సేపు చాల ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చిత్ర యూనిట్ ఒక పాటని కూడా విడుదల చేసింది. అందులో హీరో సాయి ధరమ్ తేజ్ మరియు సంయుక్త మీనన్ కలిసి ఉన్న ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈరోజు సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
స్టోరీ :
ఈ సినిమా కథ 1980 నుంచి 1990 వ సంవత్సరంలో ఒక విలేజ్ లో జరిగే కొన్ని అనుకోని సంఘటనలు జరిగే నేపథ్యంలో మొదలవుతుంది. ఈ సినిమాలో ( virupaksha movie review ) సాయి ధరమ్ తేజ్ సూర్య గా మరియు హీరోయిన్ సంయుక్త మీనన్ నందినిగా నటించారు. మొదటగా సినిమా కథ 1979 వ సంవత్సరంలో మొదలు అవుతుంది. కథ కాస్త ఇంట్రెస్టింగ్ గా 1991 వ సంవత్సరంలోకి వెళుతుంది. మొదలు రుద్రవరం అనే ఊర్లో వరుస మరణాలు చోటు చేసుకుంటాయి. ఎందుకు ఆ ఊర్లో వరుస మరణాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఎంటి ? హీరో ఈ వరుస మరణాల వెనుక ఉన్న మిస్టరీ ని ఎలా చేదించాడు ? ఆ ఊర్లో ఎవరైనా చేత బడి చేసి చంపెస్తున్నారా ? రుద్రవరం ని పట్టి పీడిస్తున్న శక్తులు ఎంటి ? హీరో కి ఉన్న పవర్స్ ఎంటి ? ఇవన్ని మీకు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
పెర్ఫార్మెన్స్ :
ఈ సినిమా లో ( virupaksha movie review ) హీరో సాయి ధరమ్ తేజ్ నటన ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఒక కొత్త ఫ్రెష్ లుక్ లో కనిపించాడు. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బెస్ట్ సినిమా గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో కథానాయికగా సంయుక్త మీనన్ నటించింది. సెకండ్ హాఫ్ లో సంయుక్త మీనన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా లో నటుడు అజయ్ అఘోరా పాత్రలో నటించాడు. అజయ్ ఈ పాత్రలో చాలా బాగా నటించాడు. అంతేకాకుండా బ్రహ్మజి , రాజీవ్ కనకాల మరియు సునీల్ తదితరులు నటించారు.
టెక్నికల్ వాల్యూస్ :
ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు దండు కార్తిక్ వర్మ చాలా బాగా దర్శకత్వం వహించాడు. ఆడియెన్స్ కి ఎక్కడ బోర్ అనిపించకుండా తను ఈ సినిమా కథ రాసుకుని , అదేవిధంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకి మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా చాలా బాగా అందించారు. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా హైలెట్. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే ని అందించారు. ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా స్క్రీన్ ప్లే ని అందించాడు.
ప్లస్ పాయింట్స్ :
-సాయి ధరమ్ తేజ్ నటన
-సంయుక్త మీనన్ నటన
-స్టోరీ
-స్క్రీన్ ప్లే
-బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
-డైరెక్షన్
-సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్ :
-క్లైమాక్స్
-కొన్ని సన్నివేశాలు
మూవీ రేటింగ్ : 3.5/5