bhringraj powder :
బ్రింగ్ రాజ్ పౌడర్ ని ( bhringraj powder ) బ్రింగ్ రాజ్ చెట్టు యొక్క ఆకుల ద్వారా తయారు చేస్తారు. తెలుగులో బ్రింగ్ రాజ్ ని గుంటగలగరాకు అని పిలుస్తారు. గుంటగలగరాకు ఎక్కువగా పంట చెన్లలో పెరుగుతాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఈ ఆకుకి మంచి డిమాండ్ ఉంది. బ్రింగ్ రాజ్ ఆకుల్ని చాలా వ్యాధులను నయం చేయడానికి వాడుతారు. బ్రింగ్ రాజ్ యొక్క ఉపయోగాలు చాలా మందికి తెలియదు. ఒకవేళ దీని ఉపయోగాలు గనుక మీకు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు. బ్రింగ్ రాజ్ ని ఆంగ్లం లో ఫాల్స్ డైసీ అని పిలుస్తారు. ఈ మొక్క మూడు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. చాలా మందికి ఈ మొక్క గురించి తెలియదు మరియు ఎలా గుర్తుపట్టాలో కూడా తెలియదు.
ఈ మొక్క యొక్క ఆకులు ( bhringraj powder ) చిన్నగా ఉంటాయి. ఈ మొక్క మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. ఈ మొక్కకు చిన్నగా తెలుపు రంగులో పువ్వులు పూస్తాయి. ఆయుర్వేదం లో బ్రింగ్ రాజ్ ని దివ్యమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కగా భావిస్తారు. ఈ బ్రింగ్ రాజ్ ని పూర్వ కాలం నుండి ఇప్పటి వరకు ఆయుర్వేదం లో ఎక్కువగా వాడుతారు. బ్రింగ్ రాజ్ మొక్క నుండి ఆకుల్ని వేరు చేసి ఎండలో ఎండ బెట్టి , తర్వాత ఈ ఆకుల్ని చూర్ణం గా చేసి వాడుతారు.
బ్రింగ్ రాజ్ పౌడర్ యొక్క ఉపయోగాలు : health benefits of bhringraj powder
1.బ్రింగ్ రాజ్ పౌడర్ యాంటి ఇన్ఫ్లమేటరీ గా పని చేస్తుంది. బ్రింగ్ రాజ్ వాపు మరియు నొప్పుల నుంచి ఉపశమనం ని కలిగిస్తుంది.
2.బ్రింగ్ రాజ్ యాంటి మైక్రోబియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బ్రింగ్ రాజ్ శరీరంలోని హానికరమైన ఫ్రీరాడికల్స్ పై పోరాడడం లో పని చేస్తాయి.
3.బ్రింగ్ రాజ్ పౌడర్ ని వాటర్ లో మిక్స్ చేసుకుని తాగడం వల్ల కాలేయ సంబంధిత మరియు కామెర్ల వ్యాధి రాకుండా కాపాడుతుంది.
4.బ్రింగ్ రాజ్ పౌడర్ ని ( bhringraj powder ) హేర్ ఆయిల్ లో మిక్స్ చేసుకుని వాడితే, జుట్టు రాలిపోయే సమస్యని తగ్గిస్తుంది. అంతేకాకుండా కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
5.బ్రింగ్ రాజ్ పౌడర్ ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక జ్వరం ని తగ్గించవచ్చు.
6.గోరు వెచ్చని నీరు లేదా తేనెతో బ్రింగ్ రాజ్ పౌడర్ ని తీసుకోవడం వల్ల శ్వాసకోస సంబంధిత వ్యాధులకి చెక్ పెట్టవచ్చు.
7.పాత బెల్లం తో బ్రింగ్ రాజ్ పౌడర్ ని కలిపి తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య మరియు గుండెలో మంట ని తగ్గిస్తుంది.
8.బ్రింగ్ రాజ్ పౌడర్ ను వాటర్ లో కలిపి తీసుకోవడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే మొహం పై ముడతలు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా అవుతుంది.