podupu kathalu in telugu : తెలుగు పొడుపు కథలు
చిన్నపుడు మన ఇంట్లో తాతమ్మో లేదా తాతయ్యనో పొదుపు కథలని ( podupu kathalu in telugu ) అడిగేవారు. ఈ పొడుపు కధల జవాబు తెలియడానికి చాలా మంది చాలా కష్టపడి ఉంటారు. వీటి జవాబు కనుక్కోవడం అంత సులభం ఏమి కాదు. పొడుపు కథలు మన మెదడుకి చాలా పదును పెడతాయి. అలాంటి పొడుపు కథలని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. జవాబు ఇవ్వడానికి ట్రై చేయండి.లు
podupu kathalu in telugu : తెలుగు పొడుపు కథలు
1.దాన్ని అంగట్లో కొంటారు మరియు దాన్ని ముందర పెట్టుకుని ఏడుస్తారు.ఏంటది?
జవాబు : ఉల్లిపాయ
2.ఆకారం ఏమో పుష్టి, మరియు నైవేద్యం నష్టి… ఏంటది ?
జవాబు : పుచ్చకాయ
3.కంటికి దొరకదు , చేతికి అందదు మరియు ముక్కుకు అందును … ఏంటది ?
జవాబు : వాసన
4.చాచుకొని సావిట్లో పడుకుంటుంది మరియు ముడుచుకుని మూల నక్కుతుంది..ఏంటది ?
జవాబు : చాప
5.గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు …ఏంటది ?
జవాబు : కోడి గుడ్డు
6.కళ్ళు లేవు గానీ ఏడుస్తుంది… కాళ్ళు లేవు గానీ నడుస్తుంది …ఏంటది ?
జవాబు : మేఘం
7.కంటికి కనబడుతుంది కానీ గుప్పిట్లో పట్టడానికి మాత్రం వీలు కాదు ..ఏంటది ?
జవాబు : పొగ
8.ఒకవైపు తింటాడు మరియు ఇంకో వైపు కక్కుతాడు …ఏంటది ..?
జవాబు : తిరగలి
9.కళ్ళు ఉన్నాయి గానీ చూపులేదు మరియు కొప్పు ఉంది గానీ దానికి జుట్టు లేదు .. ఏంటది ?
జవాబు : టెంకాయ
10.కడుపు నిండగానే లేచి నిలబడతాడు. ఏంటది ..?
జవాబు : గోనె సంచి
11.ఆకు వేసి అన్నం పెడితే , ఆ ఆకుని తీసేసి భోజనం చేస్తాం.. ఏంటది ..?
జవాబు : కరివేపాకు
12.చారల చారల పాము , నునువైన పాము , చక్కటి పాము మరియు వ్రేలాడే పాము ..ఏంటది ?
జవాబు : పొట్లకాయ
13.ఆటకత్తే ఎప్పుడు లోనే నాట్యం చేస్తూ ఉంటుంది.. ఏంటది ?
జవాబు : నాలుక
14.ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు … ఏంటది ?
జవాబు : వేరుశనగ కాయ
15.ఎర్రటి పండు మీద ఈగ అయిన వాలదు…ఏంటది ?
జవాబు : నిప్పు
16.తడిస్తే గుప్పెడు మరియు ఏండితే బుట్టెడు… ఏంటది..?
జవాబు : దూది
17.పచ్చని బాబు కి రత్నాల ముగ్గు… ఏంటది ?
జవాబు : విస్తరాకు
18.ఎందరు ఎక్కిన విరగని మంచం …ఏంటది ?
జవాబు : అరుగు
19.మూత తెరిస్తే ముత్యాల సరాలు .. ఏంటది ?
జవాబు : పళ్ళు
20.గది నిండా రత్నాలు , గదికి తాళం… ఏంటది ?
జవాబు : దానిమ్మ
21.వొళ్ళంతా ముళ్ళు మరియు కడుపంతా చేదు … ఏంటది ?
జవాబు : కాకరకాయ
22.ఆవిడ వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే ….ఏంటది !
జవాబు : ఆవులింత
23.కాళ్ళు చేతులు ఉన్నా నడవనిధి … ఏంటది ?
జవాబు : కుర్చీ
24.కన్ను ఉన్నా తల లేనిది. ఏంటది …?
జవాబు : సూది
Podupu kathalu in telugu :
25.పాము లేదు గానీ పుట్ట ఉంది మరియు తల లేదు గానీ గొడుగు వేసుకుంది …! ఏంటది ?
జవాబు : పుట్టగొడుగు
26.ఈత చెట్టుకి ఇద్దరు పిల్లలు
జవాబు : కుండలు
27.ఇల్లంతా వెలుగు మరియు బండ కింద చీకటి
జవాబు : దీపం
28.పైన చూస్తే పండు మరియు పగల గొడితే బొచ్చు
జవాబు : పత్తికాయ
29.నీళ్లలో పుడుతుంది. నీళ్లలో పడితే చస్తుంది.
జవాబు : ఉప్పు
30.చెవులు పట్టుకుని ముక్కు మీద కూర్చుంటుంది. మొసేదొకరు మరియు చూసేదొకరు … ఏంటది ?
జవాబు : కళ్ళజోడు