Dasara Movie Review :
న్యాచురల్ స్టార్ నాని నటించిన ” దసరా ” ( dasara movie review ) సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించాడు. కీర్తి సురేష్ ఈ సినిమా లో కథానాయిక గా నటించింది. దసర మూవీ ని శ్రీకాంత్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తో శ్రీకాంత్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో సాయికుమార్, సముతికరని, పూర్ణ , జరీనా మరియు దీక్షిత్ తదితరులు నటించారు.సంతోష్ నారాయణ్ ఈ సినిమా కి మ్యూజిక్ ని అందించారు. దసర సినిమా ని చెరుకూరి సుధాకర్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చిత్రాన్ని నిర్మించారు.
శ్రీ రామనవమి పండగ సంద్భంగా చిత్ర యూనిట్ దసర సినిమా ని ( dasara movie review ) విడుదల చేశారు. ఇప్పటికే ట్విట్టర్ రివ్యూస్ ఈ సినిమా పై పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా నీ కొత్త డైరెక్టర్ డైరెక్ట్ గా చేసినట్టు లేదని, నాని పెర్ఫార్మెన్స్ మరియు కీర్తి సురేష్ నటన కూడా బాగుందని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విడుదల కి ముందే చిత్ర యూనిట్ చంకిల అంగేసి సాంగ్ ని విడుదల చేశారు. విడుదల అయిన కొన్ని నిమిషాల్లోనే ఈ పాట చాలా వైరల్ అయింది. ఈ సాంగ్ తో ఒక్కసారిగా అందరి దృష్టి సినిమా పై మళ్లింది.
కథ :
ఈ సినిమా కథ గోదావరి ఖని జిల్లా వీర్లపల్లి అనే ఊరిలో మొదలవుతుంది. నాని మరియు తన స్నేహితుడు కలిసి బొగ్గు దొంగిలించే పనులు చేస్తుంటారు. వీర్లపల్లి ఊరిలో మగవారు అంత తాగుడుకు భానిస అవుతారు. ఎన్టీయార్ ప్రభుత్వం రాగానే మద్యపానం నిషేధం చేస్తారు. దీంతో అందరూ ఒక్కింత నిరాశ చెందుతారు. దీన్నే అదునుగా తీసుకుని ఆ ఊరి పెద్ద మనిషి మళ్ళీ తిరిగి బార్ ని ఓపెన్ చేస్తాడు. నాని స్నేహితుడు కీర్తి సురేష్ ని లవ్ చేస్తాడు. ఈ విషయం నాని కి తెలిసి తను ప్రేమించిన కూడా తన స్నేహితుడి సూరి కోసం తన లవ్ ని వదిలేస్తాడు. కీర్తి సురేష్ కి మరియు సూరి కి పెళ్లి అవుతుంది. అదే రోజు సూరి ని ఆ ఊరి పెద్ద మనిషి కొడుకు చంపేస్తాడు. సూరి ని ఆ ఊరి పెద్ద మనిషి కొడుకు ఎందుకు చంపేశాడు .సూరి చనిపోయాక కీర్తి సురేష్ పరిస్తితి ఏమిటి ? తన స్నేహితుడు చనిపోయాక నాని వాళ్ళ పై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు ? అని తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే ….
పెర్ఫార్మెన్స్ : ( dasara movie review )
ఈ సినిమా లో నాని మాస్ క్యారెక్టర్ లో నటించాడు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో నాని చేసిన క్యారెక్టర్ ద్వారా నానికి మరింత పేరు తెచ్చిపెడుతుంది. నాని అచ్చం ఈ సినిమాలో తాగినట్టే నటించాడు. అంతేకాకుండా నాని సరసన నటించిన కీర్తీ సురేష్ కూడా చాలా బాగా నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ అంగన్వాడీ టీచర్ గా నటించింది. కీర్తి సురేష్ తన డాన్స్ తో మరియు నటన తో ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. దీక్షిత్ హీరో స్నేహితుడి పాత్రలో చాలా బాగా నటించాడు. విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో మరియు సాయి కుమార్ , పూర్ణ తమ తమ పాత్రలో చాలా బాగా నటించారు. ఓవరాల్ గా ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా చెప్పుకోవచ్చు.
టెక్నికల్ వాల్యూస్ :
ఈ సినిమా కి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ని అందించాడు. ఈ సినిమాలో పాటలు కథకి తగ్గట్టుగానే తెలంగాణ భాష లోనే ఉంటాయి. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి మ్యూజిక్ ని చాలా బాగా అందించారు. ఈ సినిమాలో పాటలు మరియు ఫైట్స్ చాలా బాగా తెరకెక్కించారు. ఈ సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా బాగుంది. ఈ సినిమా కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
1.నాని మరియు కీర్తి సురేష్ నటన
2.భావోద్వేగాలు
3.కథ
4.సాంగ్స్
5.క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
1.కథ కొంచం స్లో గా అనిపించడం
2.ప్రెడిక్టబుల్ కథ
Dasara Movie Review and Rating : 3.5/5