Kidney stones :
మూత్ర పిండాల లో ( kidney stones ) రాళ్ళు రావడం ఈ కాలంలో చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఇలా మూత్రపిండాలలో రాళ్ళు రావడం అనే సమస్య మారుతున్న ఆహారపు అలవాట్ల వలన కొంత అయితే మరి కొంత మన జీవన విధానం వలన ఇలా ప్రతీది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సమస్యని ఏదురుకోవాల్సివస్తుంది. అసలు మూత్ర పిండాలలో రాళ్ళు ఏందుకు ఏర్పడుతాయి అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు అసలు మూత్ర పిండాలలో రాళ్ళు రావడానికి కారణాలు మరియు వాటిని ఎలా గుర్తించాలి. ఏలాంటి ఆహారాన్ని తీసుకుంటూ వాటిని నివారించాలో తెలుసుకుందాం.
మూత్ర పిండాలలో రాళ్ళు రావడం అంటే ఏమిటి?
మొదటగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు కిడ్నీలు ఎం చేస్తాయి ? మూత్ర పిండాలు ఎం చేస్తాయంటే అవి మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. ఇలా శుద్ధి చేస్తున్నపుడు వెలువడే మలినాలను కొంత చెమట రూపంలో మరి కొంత మూత్రం రూపంలో బయటకి పంపిస్తాయి. ఇలా శుద్ధి చేసే క్రమంలో కొన్ని రసాయనాలు మన మూత్రం ద్వారా బయటకి వెళ్లకుండా మూత్ర పిండం లో ఉండిపోతాయి. ఇలా అవి పెరిగి పెరిగి అవి రాళ్ళుగా మారుతాయి.
ఇలా మారడం వలన మూత్ర పిండాలకి సంబంధించిన వ్యాధులు ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందులో మొదటిది ఒకవేళ ఆ రాళ్ళు మూత్ర నాళంలో మధ్యలో ఆగిపోవడం వలన కిడ్నీ డామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మూత్ర పిండాలలో ( kidney stones ) రెండు రకాల రాళ్ళు సహజంగా ఏర్పడుతాయి. అవి ఒకటి కాల్షియం ఆక్సలేట్ వలన ఏర్పడే రాళ్ళు రెండు యూరిక్ ఆసిడ్ వలన ఏర్పడే రాళ్ళు.
మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడడానికి కారణాలు:
మూత్ర పిండాలలో రాళ్ళు ( kidney stones ) రావడానికి ముఖ్య కారణం నీరు సరిగా తాగకపోవడం. నీళ్ళు తాగకుండా ఉండడం వలన మలినాలు ఎక్కువ అవుతాయి. అవి రాళ్ళుగా మారుతాయి.
మూత్ర పిండాల రాళ్ళలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కాల్షియం వలన ఏర్పడితే రెండవది యూరిక్ యాసిడ్ వలన ఏర్పడుతాయి. ఎక్కువ శాతం రాళ్ళు కాల్షియం అధికంగా ఉండడం వలన అది రాయిలా మారుతుంది. ఇలా కాల్షియం వలన ఏర్పడే రాళ్ళు సహజం కానీ కొంత శాతం రాళ్ళు రక్తంలోని మలినాలు వలన యూరీక్ యాసిడ్ రాయిలా మారి ఏర్పడుతాయి. ఇవి కొన్ని కారణాల వలన ఏర్పడుతుంటాయి.
1.మూత్ర పిండాలలో రాళ్ళు రావడానికి మొదటి కారణం మధుమేహ వ్యాధి. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారిలో కిడ్నీలలో రాళ్ళు ఏర్పడడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. అంతే కాదు షుగర్స్ లెవెల్స్ ని అదుపులో ఉండకుంటే పూర్తిగా కిడ్నీ పడైపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
2.అధిక బరువు: అధిక బరువు ఉన్నవారిలో కూడా మూత్ర పిండలలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక మాంసాహార ప్రొటీన్లు తీసుకోవడం వలన కూడా మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
మూత్ర పిండాలలో రాళ్ళు వచ్చాయని ఎలా గుర్తించాలి ?
మూత్ర పిండాలలో రాళ్ళు ( kidney stones ) ఏర్పడినపుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అందులో మొదటిది కడుపు కింద భాగంలో నొప్పి వస్తూ అది వీపు కింద భాగం వరకు వస్తుంది. అంతే కాదు కొందరిలో గజ్జల భాగంలో నొప్పి వస్తుంది. దీనితో పాటు జ్వరం మరియు వాంతులు అవడం ఇంకా మూత్రం వెళ్ళినపుడు మంటగా ఉండడం నొప్పి రావడం ఇంకా మూత్రం లో రక్తం రావడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ మీకు ఇందులో లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించాలి. కొన్ని టెస్టుల ద్వారా కూడా నిర్ధారించవచ్చు. అవి సిటి స్కాన్ మరియు మరికొన్ని టెస్టుల వలన తెలుసుకోవచ్చు.
మూత్ర పిండాలలో రాళ్ళు ఎలా నివారించాలి ?
1.మూత్ర పిండాలలో రాళ్ళు ( kidney stones ) రాకుండా ఉండడానికి మొదటగా శరీరానికి సరిపడా నీటిని తాగాలి. ఇలా కిడ్నీలలో రాళ్ళు నివారించవచ్చు.
2.మధుమహన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే షుగర్ వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే కిడ్నీ డిసీజ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.
3.మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అంటే ఎక్కువగా వెజిటబుల్స్ మరియు ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా వ్యాయామం చేయడం చాలా మంచిది.
4.కాల్షియం అధికంగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి.
5.అధిక రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువ శాతం బీపీ వల్లే కిడ్నీ లో రాళ్ళు ఏర్పడతాయి.