HomeHealthPiles symptoms in telugu : piles ని ఎలా గుర్తించాలి

Piles symptoms in telugu : piles ని ఎలా గుర్తించాలి

Piles symptoms in telugu :

Piles ని తెలుగులో ( Piles symptoms in telugu ) మొలల వ్యాధిగా పిలుస్తారు. మొలల వ్యాధి అంటే మలద్వారం నుండి లోపల ఉన్న రక్త నాళాలు ఉబ్బి బయటకి రావడం.ఈ వ్యాధి ఎక్కువగా చాలా సమయం కూర్చుని పనిచేసే వారిలో మరియు ఎవరైతే ఎక్కువగా మలబద్దకంతో బాధపడుతూ ఉంటారో వారిలో అలాగే మల విసర్జన బలవంతంగా చేసే వారికి వచ్చే అవకాశం ఉంటుందని దాక్టర్స్ చెప్తున్నారు. అసలు ఈ వ్యాధి రావడానికి కారణాలు ఏంటి ? ఈ వ్యాధి ని నిర్మూలించడానికి తీసుకోవాల్సిన ఆహారం మరియు ఈ వ్యాధి రాకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అనేది తెలుసుకుందాం.

Piles ని ఎలా గుర్తించాలి ? ( piles symptoms in telugu ) :

మొదటగా పైల్స్ రావడానికి ముందు చాలా మందిలో మలబద్దకం ఎక్కువగా బాధపెడుతుంది. తర్వాత ఆ మలబద్దకం తో పాటుగా మల విసర్జనకు వెళ్లిన తర్వాత మల ద్వారం నుంచి మొదటగా కొంత రక్తం రావడం గమనిస్తాం. ఇలా రక్తం రావడం గమనిస్తే పైల్స్ మొదటి దశలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. పైల్స్ వ్యాధిని నాలుగు స్టేజ్ లుగా డాక్టర్స్ సూచిస్తున్నారు.

స్టేజ్ 1 : మొదటగా మల విసర్జన తర్వాత మల ద్వారం నుండి రక్త స్రావం జరుగుతుంది.

స్టేజ్ 2 : కొన్ని రోజులకు ఇలా మల ద్వారం దగ్గర ఉబ్బడం మరియు మల ద్వారం లోపల రక్త నాళాలు వాపు రావడం చూస్తారు.

స్టేజ్ 3 : మరి కొన్ని రోజులకు ఉబ్బిన రక్త నాళాలు మల విసర్జన సమయంలో బయటికి రావడం మళ్ళీ లోపలికి పోవడం గమనిస్తారు.

స్టేజ్ 4 : చివరగా ఉబ్బిన రక్త నాళాలు బయటకి వచ్చి అలానే ఉండిపోతాయి.

piles symptoms in telugu

పైల్స్ వలన వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా బాధపడుతాయి. అందులో రక్త హీనత ఒకటి ఇలా పైల్స్ వలన వచ్చే రక్త స్రావం వలన చాలా మందిలో శరీరంలోని రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం తగ్గడం మరియు అనీమియా రావడం అంతే కాకుండా కళ్ళు తిరిగి పడిపోవడం. ఈలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తారు.

పైల్స్ రావడానికి ముఖ్య కారణాలు : Major causes of piles

1.పైల్స్ రావడానికి ముఖ్య కారణం మొదటిది ఎక్కువ సమయం కూర్చుని ఉండడం.
2.మలబద్దకం ఎక్కువగా ఉన్నవారిలో కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
3.ఎవరైతే ఏలాంటి వ్యాయామం గానీ లేదా శరీరానికి ఎలాంటి పని లేకుండా ఉంటారో వారిలో కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా చాలా రకాలుగా పైల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Piles రాకుండా తిసుకోవాల్సిన జాగ్రత్తలు : Precautions to avoid piles

1.పైల్స్ రాకుండా ఉండాలి అంటే ముందుగా మలబద్దకం రాకుండా జాగ్రత్త పడాలి.
2.మలబద్దకం రాకుండా ఉండటానికి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.
3.స్ట్రెస్ (stress) లెవెల్స్ ని తగ్గించుకోవాలి.
ఉదయం లేవగానే వ్యాయామం చేయడం ఎంతో అవసరం.
4.కూర్చున్న చోటే ఉండకుండా అటు ఇటూ నడుస్తూ ఉండాలి.
5.అధిక ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

పైల్స్ వ్యాధి మొదటి దశలో ఉన్నప్పుడే జాగ్రత పడడం మంచిది. నాలుగవ దశలో ఉన్నప్పుడు ఆపరేషన్ తో మాత్రమే తగ్గించాలి అని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఒకవేళ మీరు కొంత ఉపశమనం పొందడానికి ఎక్కువగా పళ్ళు తీసుకుంటూ, కూరగాయలు తీసుకుంటూ, మంచి డైట్ చేయడం మరియు వ్యాయామం చేయడం మంచిది.

RELATED ARTICLES
LATEST ARTICLES