Muskmelon in telugu :
వేసవి రాగానే మనకు మొదటగా గుర్తు వచ్చే ఫ్రూట్ మస్క్ మిలన్ ( muskmelon in telugu ). వేసవిలో ఎక్కువగా మనం నీటి శాతం ఉన్న ఫ్రూట్ లని మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే వేసవిలో డీహైడ్రేషన్ కి లోనవ్వకుండ ఉండాలంటే నీటి శాతం ఎక్కువగా ఉన్న ఫ్రూట్ ని తీసుకోవడం మంచిది. సాధారణంగా వేసవి రాగానే రోడ్ పక్కన ఖర్బుజా పండ్లని గమనించే ఉంటారు. ఖర్బుజా పండ్లలో చాలా పోషక విలువలు ఉంటాయి. అందుకే ఖర్బుజా తినడం చాలా మంచిది. ఈ ఖర్బుజా పండ్లు ఎక్కువగా మనకు వేసవి కాలంలోనే కనబడతాయి. ఖర్బుజా పండు లో దాదాపుగా 93 శాతం నీరు ఉంటుంది. అంతేకాకుండా ఖర్బుజా పండు తినడం వల్ల మన శరీరంలోని వేడి ని తగ్గిస్తుంది. ఖర్బుజా అధిక రక్త పోటు ని కూడా తగ్గిస్తుంది.
ఖర్బుజా పండు చూడటానికి వాటర్ మిలన్ కన్న చిన్న సైజ్ లో ఉంటుంది.అంతేకాకుండా ఖర్బుజా రుచి చాలా చప్పగా ఉంటుంది. అందుకే ఖర్బుజా తినేటపుడు చక్కెర వేసుకుని తింటారు. ఖర్బుజా ను ఎక్కువగా జ్యూస్ రూపం లో తీసుకుంటారు. వేసవి లో ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటాం.అలాంటప్పుడు ఎండకి చాలా తొందరగా అలసిపోతాం. అప్పుడు మనం ఎన్ని శీతల పానీయాలు తాగిన కూడా మన దాహం తీరదు. అప్పుడు ఎక్కువ నీటి శాతం ఉన్న ఫ్రూట్స్ తింటే చక్కని పలితం ఉంటుంది. అంతేకాకుండా ఖర్బుజా తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్ని అందుతాయి.
ఖర్బుజా లో ( muskmelon ) పోషక విలువలు : Nutrients values in muskmelon in telugu
ఖర్బుజా లో ఎన్నో మేలు చేసే పోషక విలువలు ఉన్నాయి. ఖర్బుజా లో విటమిన్ ఎ, విటమిన్ B6 , పీచు మరియు సోడియం వంటి పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా ఖర్బుజా లో కాల్షియమ్ , మెగ్నీషియం మరియు పొటాషియం, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ సి వంటి ఇతర చాలా పోషకాలు ఉన్నాయి.
ఖర్బుజా తినడం వల్ల కలిగే ఉపయోగాలు : Health benefits of muskmelon in telugu
1.ఖర్బుజాలో విటమిన్ ఎ, బీటకేరోటిన్ , ఫోలిక్ ఆమ్లం మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఖర్బుజా తింటే కంటి చూపు మెరుగుపడుతుంది.
2.ఖర్బుజా లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది మన శరీరములో రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఇన్ఫెకషన్ల భారిన పడకుండా కాపాడుతుంది.
3.ఖర్బుజా తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెదడు కి రక్త ప్రసరణ బాగా జరిగి మెదడుని ఆక్టివ్ గా పనిచేసేలా చేస్తుంది.
4.పని వొత్తిడి కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఖర్బుజా తింటే వొత్తిడి ని తగ్గించి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.
5.గర్భిణీలు ఖర్బుజా పండుని తినడం చాలా మంచిది. ఎందుకంటే ఖర్బుజా లో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. ఫోలిక్ ఆమ్లం గర్భిణీ స్త్రీలలో బిడ్డ ఎదుగదలకు భాగ ఉపయోగపడుతుంది.
6.కిడ్నీ లో రాళ్ల సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. కిడ్నీ లో రాళ్లు ఏర్పడితే నడవడానికి మరియు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు ఖర్బుజా తింటే కిడ్నీ లో రాళ్ళని కూడా కరిగిస్తుంది.
7.ఉబకాయంతో బాధపడేవారు ఖర్బుజా నీ తింటే బరువు పెరగకుండా ఉంటారు. ఎందుకంటే ఖర్బుజా లో తక్కువ క్యాలరిస్ ఉంటాయి. ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. అందుకే ఖర్బుజా తింటే అధిక బరువు ని తగ్గిస్తుంది.
8.చక్కెర వ్యాధితో బాధపడేవారు ఈ ఖర్బుజా పండు ని తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. ఖర్బుజా లో తక్కువగా క్యాలరీలు ఉంటాయి. ఎక్కువ పీచు పదార్ధం ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు ఖర్బుజా ని తినడం మంచిది.
9.ఖర్బుజా తినడం వల్ల చర్మం మీద వచ్చే వయసు పై బడిన ముడతలు రాకుండా కాపాడుతుంది. చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా చేస్తుంది.