Moong dal in telugu :
మనం ఎక్కువగా పెసర పప్పు తో ( moong dal in telugu ) వివిధ రకాల కూరలను తయారు చేసుకుని తింటాం. పెసరలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి కాబట్టి పెసర పప్పు తో చేసిన వంటకాలు తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. పెసర పప్పుతో ఎక్కువగా పెసరట్టు చేసుకుని తింటారు. మన దేశంలో కొన్ని ప్రదేశాల్లో పెసరట్టు చాలా ఫేమస్. పెసర తో ఒక పెసరట్టు మాత్రమే కాకుండా చాలా వంటలు చేసుకోవచ్చు. పెసరట్టు తో పొంగలి మరియు క్రిస్పీ మూంగ్ దాల్ కూడా తయారు చేస్తారు. మన దేశంలో క్రిస్పీ మూంగ్ చాలా ఫేమస్. ఎంతో మంది ఈ క్రిస్పీగా ఉండే మూంగ్ దాల్ ని తినడానికి ఇష్టపడతారు. మార్కెట్ లో కూడా ఈ ఎల్లో కలర్ మూంగ్ దాల్ కి మంచి గిరాకీ ఉంది.
పెసర తో ( moong dal in telugu ) సలాడ్ మరియు సూప్స్, చారు కూడా చేసుకుంటారు. మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అన్ని పేసరలో ఉంటాయి. మన శరీర రోగ నిరోధక శక్తి ని పెంపొందించడానికి పెసర చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా పెసర ని మొలకెత్తిన తర్వాత తింటారు. ఇలా మొలకెత్తిన పెసర తినడం వల్ల మన శరీరానికి కావల్సిన అమైనో ఆమ్లాలు మరియు ప్రొటీన్లు ఎక్కువగా మోతాదులో అందుతాయి. ముఖ్యంగా మన దక్షిణ భారత దేశం లో ఎక్కువ మూంగ్ దాల్ ని వంటకాల్లో వాడుతారు. పెసర పప్పు లో ఎక్కువగా యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇది మనల్ని రోగాల భారిన పడకుండా కాపాడుతుంది. పెసర పిండిని ఎక్కువగా చర్మ సౌందర్యానికి మహిళలు వాడుతారు.
పెసర లో పోషక విలువలు : Neutrients Values in moong dal
పెసర లో ఎక్కువగా మెగ్నీషియం, మాంగనీస్ మరియు పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా పేసరలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ,ఐరన్ మరియు జింక్ ఉంటాయి. పెసర లో విటమిన్ B 9 మరియు విటమిన్ B4 యే కాకుండా విటమిన్ B2, B,3 & B5 పుష్కలంగా ఉంటాయి. పెసర లో ( moong dal in telugu ) యాంటి ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.
పెసర తో కలిగే ప్రయోజనాలు : Health benefits of moong dal in telugu
1.పెసర ని ఎక్కువగా చర్మ సౌందర్యానికి వాడుతారు పెసర ని పిండి చేసి దానికి పాలని కలిపి మొహానికి పట్టించి చల్లని నీటితో కడగాలి. ఇలా చేస్తే చర్మం యవ్వనంగా కనబడుతుంది.
2.పెసరలో ఫైబర్ ఉంటుంది. పెసర లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
3.పెసరలో ఎక్కువగా యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. జ్వరం, జలుబు మరియు ఫ్లూ వంటి బారిన పడకుండా కాపాడుతుంది. పెసర తో సూప్ చేసుకుని తాగితే జ్వరం త్వరగా తగ్గుతుంది.
4.పెసరతో చేసిన వంటకాలు తినడం వల్ల గుండె పోటు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా రక్త పోటు రాకుండా కూడా కాపాడుతుంది.
5.జీర్ణ క్రియ సమస్యతో బాధపడుతున్న వారు పెసర తో చేసిన వంటకాలు తింటే ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే పెసరలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది జీర్ణ క్రియ వ్యవస్థ ని మెరుగుపరుస్తుంది.
6.పెసర ని తినడం వల్ల డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఎందుకంటే చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచే గుణాలు పేశరలో ఉంటాయి.