Ganneru pappu :
గన్నేరు పప్పు ( ganneru pappu ) ఈ పేరు వినగానే చాలా మంది భయపడతారు. నిజంగానే గన్నేరు పప్పు అంత ప్రమాదకరమా ? గన్నేరు పప్పు తింటే నిజంగానే చనిపోతారా? ఇది వరకు మనం వార్తల్లో చాలా వింటుంటాం గన్నేరు పప్పు తిని చనిపోయారని , నిజానికి గన్నేరు పప్పు చాలా ప్రమాదకరం. గన్నేరు పప్పు తింటే చనిపోతారు అని మన పెద్దలు కూడా చెబుతుంటారు. కానీ ఈ మొక్కని గనుక మీరు చూస్తే గన్నేరు పప్పు ప్రమాదకరం అని అస్సలు నమ్మరు ఎందుకంటే గన్నేరు చెట్టు పూలతో చాలా అందంగా ఉంటుంది.
తెల్ల గన్నేరు ( thella ganneru ) , ఎర్ర గన్నేరు ( erra ganneru ) , బిళ్ళ గన్నేరు ( billa ganneru ) మరియు పచ్చ గన్నేరు ( pacha ganneru ) ఇలా చాలా రకాల గన్నేరు మొక్కలు ఉన్నాయి. కానీ ఈ గన్నేరు మొక్కలన్ని చాలా ప్రమాదకరం. ఈ గన్నేరు మొక్కల్లో అన్నిటికంటే ప్రమాదం అయినది పచ్చ గన్నేరు. ఈ పచ్చ గన్నేరు పప్పు గనుక తింటే త్వరగా చనిపోవడం కాయం. ఈ పచ్చ గన్నేరు మొక్క ఆకులు సన్నగా మరియు పొడవుగా ఉంటాయి. ఈ పచ్చ గన్నేరు పూలు మాత్రం పసుపు పచ్చ రంగులో ఉంటాయి.
ఈ పచ్చ గన్నేరు చెట్టు యొక్క కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. పచ్చ గన్నేరు చెట్టుకు సూసైడ్ ప్లాంట్ అనే పేరు కూడా ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ప్రమాదకరమో. ఈ చెట్టు యొక్క కాయల్ని పొడి చేసుకుని లేదా పచ్చివి కానీ తింటే నేరుగా ఇది మన గుండె పై ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా తిన్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ పచ్చ గన్నేరు ( ganneru pappu ) తిని బ్రతికిన కూడా భవిష్యత్తులో వివిధ రకాల రోగాల భారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి చెట్లను ఇంట్లో పెంచుకోవడం కూడా మంచిది.ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇలాంటి ప్రమాదకరమైన చెట్లు అస్సలు పెంచవద్దు. ఒక వేళ వారు కనుక తింటే చాలా ప్రమాదకరం.
విశాఖ జిల్లా లో ఒక నవ వధువు కూడా గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంది. సృజన కి ఇష్టం లేకుండా వాళ్ళ తల్లి తండ్రులు పెళ్లి చేయాలి అనుకున్నారు. కానీ సృజన కి ఈ పెళ్లి ఇష్టం లేదు. తను పెళ్లి కి ముందే గన్నేరు పప్పు తిన్నది. పెళ్లి సమయానికి స్పృహ కోల్పోయింది. పోలీస్ లు తన హ్యాండ్ బ్యాగ్ వెతగగా తన బ్యాగ్ లో గన్నేరు పప్పు దొరికింది. ఇలా తను గన్నేరు పప్పు తిని చనిపోయింది. ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటది గన్నేరు పప్పు ( ganneru pappu ) ప్రమాదకరమో. అందుకే గన్నేరు చెట్టు కి మరియు గన్నేరు పప్పు కి దూరం ఉండటం చాలా మంచిది.