Apricot in telugu :
ఆప్రికాట్ చూడటానికి పరిమాణంలో చిన్నగా ఉంటుంది. అంతేకాకుండా ఆప్రికాట్ సాధారణంగా నారింజ రంగులో లేదా పసుపు రంగు లో ఉంటుంది. ఆప్రికాట్ చూడటానికి పరిమాణంలో చిన్నగా ఉన్నా దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. ఆప్రికాట్ ఎక్కువగా చైనా లో పండుతుంది. ఆప్రికాట్ ఫ్రూట్ యొక్క మూలం చైనా దేశం , కాలక్రమేణా చైనా నుంచి వివిధ దేశాలకు వ్యాపించింది. ఆప్రికాట్ ని సీమ బాదం ( apricot in telugu ) అని కూడా అంటారు. ఆప్రికాట్ రుచి కొంచం తీయగా మరియు వగరు రుచిని కలిగి ఉంటుంది. కొన్ని చోట్ల లో ఈ ఆప్రికాట్ ని ఖుర్బానీ ( apricot in telugu ) అని కూడా పిలుస్తారు.
ఆప్రికాట్ రోసేసి కుటుంబానికి చెందిన మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం ప్రునుస్ ఆర్మేనియాక ( prunus armeniaca). ఆప్రికాట్ ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో పెరుగుతుంది. అంతేకాకుండా సమశీతోష్ణ ప్రాంతాల్లో మరియు మధ్యాధర ప్రాంతాల్లో ఎక్కువగా సాగు అవుతుంది.ప్రపంచ మొత్తం లో ఆప్రికాట్ ని ఎక్కువగా టర్కీ దేశం ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ఆప్రికాట్ ని జమ్ము కాశ్మీర్, ఉత్తరకాండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈజిప్ట్ వాళ్ళు అమర్ అల్ దిన్ అనే ఒక ప్రత్యేకమైన పానీయాన్ని ఎక్కువగా తాగుతారు. ఈ పానీయాన్ని ఆప్రికాట్ తో ( Apricot in telugu ) మాత్రమే తయారు చేస్తారు. దీన్ని ఎంతో ఇష్టంగా ఈజిప్ట్ వాళ్ళు సేవిస్తారు.
ఆప్రికాట్ లో పోషకాలు : nutrients values in apricot
ఆప్రికాట్ లో బీటా కెరోటిన్ , జిక్సాంతిన్ మరియు లుటినేనిన్ వంటి యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆప్రికాట్ లో విటమిన్ ఎ, విటమిన్ సి ,విటమిన్ ఇ పుష్కంగా ఉంటాయి. ఆప్రికాట్ లో స్వల్పంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు ఫైబర్స్ ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం మొదలైన ఖనిజాలు కూడా ఆప్రికాట్ లో ఉన్నాయి.
అప్రికాట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు : health benefits of apricot in telugu
1.కంటి చూపు :
కంటి చూపు సమస్య తో బాధపడుతున్నవారు ఆప్రికాట్ ని తింటే మంచి ఫలితం ఉంటుంది.ఎందుకంటే ఆప్రికాట్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ పుష్కంగా ఉంటాయి. విటమిన్ ఎ అంధత్వం రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా విటమిన్ ఇ ప్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని పూరుస్తుంది.
2.రక్త పోటు :
చాలా మంది రక్త పోటు సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఆప్రికాట్ ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు కి చెక్ పెట్టవచ్చు. ఆప్రికాట్ లో ఉండే పొటాషియం ఎలక్ట్రోలైట్ గా పనిచేస్తుంది. పొటాషియం ఫ్లూయిడ్ బ్యాలన్స్ చేస్తూ రక్తపోటు రాకుండా చూస్తుంది. అంతేకాకుండా శరీరం హైడ్రేట్ గా ఉండేలా చేస్తుంది.
3.గ్యాస్ట్రిక్ సమస్య :
గ్యాస్ట్రిక్ సమస్య తో బాధపడుతున్నవారు ఆప్రికాట్ తింటే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఆప్రికాట్ లో అధిక ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా రక్తం లో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో చెడు కొలెస్టరాల్ స్థాయిని తగ్గించి, సన్నబడేలా చేస్తుంది.
4.చర్మ సంరక్షణ :
ఆప్రికాట్ లో విటమిన్ ఇ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా వుండటానికి దోహదపడుతుంది. అంతేకాకుండా ఎండ వల్ల కలిగే మెలనోమా కాన్సర్ వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది. ఆప్రికాట్ లో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. బీటా కెరోటిన్ మన చర్మం పాడవకుండా కాపాడుతుంది.
5.ఎముకల నొప్పి :
ఆప్రికాట్ లో కాల్షియమ్ మరియు పొటాషియం అధికంగా ఉంటాయి.కాబట్టి ఎముకల నొప్పి తో బాధపడుతున్నవారు ఆప్రికాట్ ని తింటే ఎముకల నొప్పి తగ్గుతుంది.
6.ఆప్రికాట్ ఆయిల్ :
ఆప్రికాట్ గింజల నుండి నూనె ని కూడా తీస్తారు. ఆప్రికాట్ నూనె ని చర్మం పై అప్లై చేసి కొంచం మర్ధన చేయాలి. ఇలా వారానికి ఒకసారి అయిన చేస్తే చర్మంపై ఉన్న ముడతలు పోయి , చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.