apollo fish in telugu :
మన శరీరం ఆరోగ్యంగా వుండటానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతుంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా చేపలలో లబిస్తుంది. అపోలో ఫిష్ లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అపోలో ఫిష్ ( apollo fish in telugu ) తినడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మన ఆరోగ్యం హెల్తీ గా ఉండటానికి రోజుకు 350 మిల్లి గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలని వైద్యులు చెబుతున్నారు. కాబట్టీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వున్న అహరం తీసుకోవడం చాలా అవసరం.
వేరే దేశాల్లో ఈ అపోలో ఫిష్ చేపని ఎక్కువగ తింటారు. ఈ చేపను ఎక్కువగా ఫ్రై మరియు కర్రీ రిసిపి చేసుకుని తింటారు. ఈ చేపలతో చేసిన వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ చేప కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది. ఈ చేప రుచి వేరే ఇతర చేపల రుచి కన్న బిన్నంగా ఉంటుంది కాబట్టీ ఈ అపోలో ఫిష్ ని ఎక్కువగా తింటారు. ఈ అపోలో ఫిష్ భారతదేశం లో మార్కెట్ లో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. అపోలో ఫిష్ మంచి నీటిలో ఎక్కువగా పెరుగుతుంది. కానీ ఈ అపోలో ఫిష్ చాలా కరీధైనది. అదిక ప్రాధాన్యత కలిగిన చేపల్లో ఈ అపోలో ఫిష్ ఒకటి.
అపోలో ఫిష్ ని తెలుగు లో కూడా అపోలో ఫిష్ అనే పిలుస్తారు ( apollo fish name in telugu ). ఈ అపోలో చేపని ఎక్కువగా రెస్టారెంట్స్ లో స్టార్టప్ లుగా వడ్డిస్తారు. ఉబయ తెలుగు రాష్ట్రాల్లో ఈ అపోలో ఫిష్ ని ఎక్కువగా తింటారు. అపోలో చేపల్లో ఖనిజాలు, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మరియు ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అపోలో ఫిష్ తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అపోలో చేప ధర : Apollo fish price
అపోలో ఫిష్ మార్కెట్ లో ఎక్కువగా లబిస్తుంది. దీనికి మార్కెట్ లో మంచి ధర ఉంటుంది.ఈ చేప మార్కెట్ లో దీని ధర 1 kg కి 600 రూపాయలు గా ఉంది. ఈ చేపను మనం ఆన్లైన్ లో కూడా కొనుగోలు చేసుకోవచ్చును. ఈ చేప ధర ప్రాంతాలని బట్టి మారుతూ ఉంటుంది.
అపోలో చేపలో పోషక విలువలు : Nutrition values in Apollo fish
అపోలో ఫిష్ లో చాలా పోషక విలువలు ఉంటాయి. అపోలో ఫిష్ లో ప్రొటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియమ్, ఐరన్ ,కొవ్వు మరియు సోడియం పుష్కలంగా ఉంటాయి.
అపోలో చేప తినడం వల్ల కలిగే ప్రయోజనాలు : Health benefits of apollo fish
1.అపోలో ఫిష్ లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి అపోలో ఫిష్ తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రొటీన్లు అందుతాయి.
2.కొంత మంది జ్ఞాపక శక్తి లేమితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ చేపను తింటే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.
3.గుండే జబ్బులతో బాధపడేవారు ఈ అపోలో చేపని తింటే గుండే ని ఆరోగ్యంగా వుండటానికి దోహదపడుతుంది. అంతేకాకుండా రక్తంలో HDL మరియు LDL కొలెస్టిరాల్ లెవెల్స్ ని సమతుల్యం చేస్తుంది.
4.మెదడు కి సంబంధించిన నరాలు దెబ్బతినకుండా , బాగా పనిచేసేలా చూస్తుంది.
5.చిన్న పిల్లలు అపోలో ఫిష్ తింటే చిన్న పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుంది.
6.సాధారణంగా ప్రపంచంలో గుండె పోటుతో చాలా మంది మరణిస్తున్నారు.అపోలో ఫిష్ తింటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం తగ్గుతుంది.
7.చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీర పెరుగదలకు మరియు అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది.
8.విటమిన్ D డెఫిషియన్సీ తో చాలా మంది బాధపడుతుంటారు. అమెరికాలో ఎక్కువగా విటమిన్ D డెఫిషియన్సీ తో అనారోగ్యాల పాలు అవుతారు. అపోలో ఫిష్ లో విటమిన్ D ఎక్కువగా ఉంటుంది. ఈ అపోలో ఫిష్ తింటే విటమిన్ D డెఫిషియన్సీ కి చెక్ పెట్టవచ్చు.
9.అపోలో ఫిష్ తినడం వల్ల పిల్లల్లో ఆస్తమా వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు.
10.నిద్రలేమి వ్యాధి తో బాధపడుతున్న వారు ఈ అపోలో ఫిష్ తింటే మంచి ఫలితం ఉంటుంది.