olive oil in telugu :
మారుతున్న ఆధునిక జీవన శైలి విధానంలో మంచి ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. మంచి ఆహారం తీసుకోవడమే కాదు దానిలో వాడే నూనె కూడా ఏం వాడడుతున్ననమో అన్నది కూడా చాలా ముఖ్యం. కొందరు మార్కెట్ లో చౌకగా దొరికే నూనె కొనుగోలు చేసి వంటకాల్లో ఉపయోగిస్తారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆలివ్ ఆయిల్ లో (olive oil in telugu ) అనేక రకాల విటమిన్లు ఉంటాయి. అందుకే ఆలివ్ ఆయిల్ ని (olive oil in telugu )ఉపయోగించి మీ ఆరోగ్యాన్ని పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోండి.
ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిత్యం మనం ఏదో ఒక జబ్బుతో బాధపడుతుంటాం. వీటన్నిటికి మనం చెక్ పెట్టాలి అంటే ఆలివ్ ఆయిల్ ని వంటకాల్లో చేర్చడం ద్వారా చాలా రకాల జబ్బులకు చెక్ పెట్టవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్ నూనె తో వంటకాలు చేస్తే రుచి కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఆలివ్ ఆయిల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E , విటమిన్ K, ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మం పై ఉన్న ముడతలు గాని లేదా మొటిమలు పోవడమే కాకుండా చర్మం నిగారింపు వస్తుంది. ఆలివ్ ఆయిల్ ను రోజు వంటకాల్లో వాడటం వల్ల శరీరంలోని చెడు కొవ్వును కరిగించి గుండెని పదిలంగా ఉంచుతుంది.
ఆలివ్ ఆయిల్ లో చాలా పోషక పదార్థాలు వుండటం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. దీనివల్ల దగ్గు, జలుగు మరియు సీజనల్ ఇన్ఫెక్షన్స్ వంటివి రాకుండా కాపాడుతుంది. అధిక బరువు తో బాధ పడేవారు రోజు ఆలివ్ ఆయిల్ ని తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వును కరిగించి సన్నబడెలా చేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణను కూడా అదుపులో ఉంచుతుంది.
డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారు రోజు ఆలివ్ ఆయిల్ తో వంటలు చేసుకుని తింటే డయాబెటిస్ ని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్టరాల్ స్థాయిని తగ్గించి, చెడు కొ్లెస్టరాల్ పెరగకుండా చూస్తుంది. వయస్సు పెరిగే కొద్ది చాలా మంది ఎముకల నొప్పి తో లేదా కండరాల నొప్పితో బాధపడుతుంటారు. వీటన్నిటికి మీరు చెక్ పెట్టాలి అనుకుంటే ఆలివ్ ఆయిల్ ని వాడల్సిందే. ఇలా రోజు వాడితే కొన్ని రోజుల్లోనే ఎముకల నొప్పి పోయి మంచి ఫలితం ఉంటుంది.
ప్రతీ రోజు మీరు ఆలివ్ ఆయిల్ తో ఆహారాన్ని వండినట్టు అయితే కాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇవి కాన్సెర్ కణాలను అడ్డుకుంటాయి. అంతేకాకుండా ఆలివ్ ఆయిల్ డయాబెటిస్ టైప్ -2 రాకుండా చూస్తుంది. ఆలివ్ ఆయిల్ తో తయారు చేసిన ఫుడ్స్ తినడం వల్ల అతి ప్రమాదకరమైన అల్జీమర్స్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఆలివ్ ఆయిల్ నూనె ని రోజు ఉపయోగించుకోవడం వల్ల మలబద్దక సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: ఉసిరికాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు