Amla juice health benefits :
ఉసిరికాయ ( amla juice ) అంటే బహుశా తెలియని వారు ఎవరూ ఉండరేమో. ఉసిరికాయ వల్ల మనకు తెలియని చాల ఉపయోగాలున్నాయి ( amla juice ). ఉసిరికాయ ని ఇంగ్లీష్ లో gooseberry అని పిలుస్తారు. ఉసిరికాయ లేత ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఉసిరకాయ ఆకులు చాలా చిన్నవి గా ఉంటాయి. అంతేకాకుండా ఇది పుల్లని రుచిని కలిగి ఉంటుంది. ఉసిరి కాయ ని ” శ్రీ ఫలం అని మరియు amla అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఉసిరికాయ లో విటమిన్ C అధికంగా ఉంటుంది. విటమిన్ C అదికంగా ఉండటం వల్ల దీనిని ఎక్కువగా ఆయుర్వేద మెడిసిన్ తయారీ లో వాడుతారు.
ఉసిరికాయ లో విటమిన్ C అదికంగా ఉండటం వల్ల మనం రోజు ఉసిరికాయ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయ లో నిమ్మకాయలో వుండే విటమిన్ C కన్నా 20 రెట్లు అధికంగా ఉంటుంది. ఉసిరికాయ లో విటమిన్ C అదికంగా ఉండటం వలన జలుబు మరియు దగ్గు మొదలగు శ్వాస కోశ సంబంధిత తదితర వ్యాధుల నుంచి ఉశమనం లబిస్తుంది.
ఎవరైతే స్థూలకాయం తో బాధపడతారో వాళ్ళు రోజు ఉసిరికాయ తినడం వల్ల శరరంలోని చెడు కొవ్వు ని కరిగించి సన్న బడెలా చేస్తుంది. అంతేకాకుండా ఉసిరికాయ పొడిని రోజ్ వాటర్ లో కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట సేపు తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రోజు చేయటం వల్ల మొహం పై ఉన్న మొటిమలు పూర్తిగా తగ్గి మొహం కాంతివంతంగా తయారు అవుతుంది. అంతేకాకుండా మోహం పై ఉన్న ముడతలు కూడా మాయం అవుతాయి. విటమిన్ C ఉసిరికాయ లో అదికంగా వుండటం వల్ల ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.
మధుమేహ వ్యాధి తో బాధ పడుతున్నవారు రోజు ఉసిరకాయల్ని తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అదిక షుగర్ లెవల్స్ ఉన్న వాళ్ళు రోజు ఉసిరికాయ తింటే కొన్ని రోజుల్లోనే షుగర్ లెవెల్స్ కంట్రోల్ కి వస్తుంది. జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉసిరికాయ ఎంతో మేలు చేస్తుంది. ఉసిరకాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి రోజు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మలబద్దక సమస్యని కూడా తగ్గిస్తుంది.
ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్ లు , ఫైబర్స్ యే కాకుండా విటమిన్ B1 ,B2, B3 , B5 మరియు B6 లు అధికంగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొందరికి నోరు ఎంత క్లీన్ చేసుకున్నా కూడా నోటి దుర్వాసన వస్తుంది. దీనికోసం చాలా మంది మార్కెట్ లో దొరికే మౌత్ రిఫ్రెషర్లని వాడుతారు. మరికొందరు సొంపు ని వాడుతారు. సొంపు నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా జీర్ణక్రియ వ్యవస్థ ని మెరుగుపరుస్తుంది. ఉసిరికాయ తినడం వల్ల కూడా నోటి దుర్వాసన పోతుంది. హార్మోనల్ ఇన్ బ్యాలన్స్ సమస్యను కూడా ఉసిరకాయలతో చెక్ పెట్టవచ్చు.
ఉసిరికాయని పచ్చడి రూపంలో కూడా తీసుకుంటారు. అంతేకాకుండా ఉసిరికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువగా వంటకాల్లో కూడా వాడుతారు. స్త్రీలు ఎక్కువగా ఉసిరికాయని కార్తీక మాసంలో దీపారాధనకు వాడుతారు. ఉసిరకాయలపై దీపాన్ని వెలిగించి కార్తీక మాసం లో సోమవారం రోజున దేవుడిని కొలుస్తారు. మళ్ళీ ఉసిరికాయ చెట్టు ఆకులను కూడా కార్తీక సోమవారం రోజున నీళ్లలో వేసుకుని స్నానం కూడా చేస్తారు. మరికొందరు అయితే ఉసిరకాయల చెట్టు ని దైవం లాగా కొలుస్తారు ఈ చెట్టు ముందు దీపాన్ని వెలిగించి మొక్కుతారు. ఇలా స్త్రీలు ఉసిరకాయ చెట్టును దైవంలా చూస్తారు.
ఉసిరికాయ మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటని తగ్గిస్తుంది. అంతేకాకుండా యూరినరీ ట్రాక్ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. కొద్దిగా ఉసిరికాయ రసం ని తీసుకుని దానికి కొంచం తేనె ని కలిపి తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఉసిరికాయల తినడం వల్ల రక్త హీనత సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారు రోజు ఉదయం ఉసిరికాయ తినడం వల్ల కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారికి చక్కని ఉపశమనం లభిస్తుంది. రోజు ఉసిరికాయ జూస్ తాగడం వల్ల గుండె పదిలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా ఉసిరకాయని రోజు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
కొందరికి జుట్టు ఊరికే రాలిపోతుంటుంది అలాంటి వారికి ఉసిరికాయ ఒక చక్కని పరిష్కారం. ఉసిరకాయల రసం మరియు ఆకుల రసాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక అరగంట సేపు తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య తగ్గడమే కాకుండా తలపై వున్న చుండ్రు సమస్య కూడా తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరికాయల జ్యూస్ తాగడం శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది.