Papaya Benefits: బొప్పాయి పండు ఉపయోగాలు
బొప్పాయి పండు (papaya) తినడం వలన చాలా ఉపయోగాలు (benefits) ఉన్నాయి. మనం వారానికి మూడు రోజులు తింటే చాలు మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే .బొప్పాయి (papaya) పండులో విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి అవి ‘ఎ, బి,సి’ .బొప్పాయి తినడం వలన చర్మ వ్యాధులు మరియు చర్మం ముడుతలు పడదు అంతే కాకుండా చర్మం కాంతి వంతంగా మెరుస్తూ ఉంటుంది. కళ్ళు బాగా కనపడటానికి ఎంతో తోడ్పడుతుంది.పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ చాలా చక్కగా జరగడానికి తోడ్పతుంది. పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, కాపర్ మరియు మినరల్స్ మన శరీరానికి కావలసిన మొత్తం అందుతాయి.అన్నిటికంటే చాలా ముఖ్యమైనది రక్త కణాలను మరియు ప్లేట్ లెట్స్ నీ పెంచడంలో బొప్పాయి చెట్టు లేత ఆకుల రసం చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ వ్యాధి రాకుండ కాపాడుతుంది.
ఇంకా బొప్పాయి పండులో’బి’ కాంప్లెక్సులు బి1,బి2,బి3 మరియు బి5 ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రక్తపోటు వ్యాధి ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. రక్తపోటు తగ్గిచడంలో బొప్పాయి చాలా బాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలంటే బొప్పాయి తినటం చాలా మంచిది. అసలు బరువు పెరగరు. ఇందులో పీచు పదార్థాలు ఉండటం వలన మలబద్దకం రాకుండా ఉంటుంది.చక్కర వ్యాధి ఉన్నవారు కొంచం తక్కువ తీసుకోవడం మంచిది. ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్లలో కనపడే సమస్యలు pcod, pcos మన అందరికి తెలిసిందే బొప్పాయి తినడం వలన ఈ సమస్యలను కొంత వరకు తగ్గించుకోవచ్చు.
గర్భిని స్త్రీలు బొప్పాయి తినడం మంచిది కాదు ఎందుకనగా ఇందులో కొలన్ ఉంటుంది. శ్వాస సంబంధించిన వ్యాధులు ఉన్నవారు తీసుకోకపోతే చాలా మంచిదని నిపుణులు చెపుతున్నారు వీరు తీసుకుంటే ‘ఎలర్జీ’ వస్తుంది. మగవారు ఎక్కువగా తీసుకోవడం వలన వీర్యకణాలు తగ్గుతాయి. రోజు తీసుకోవడం వలన పచ్చకామెర్లు, చర్మం రంగు మారడం జరుగుతుంది. మరి ఎక్కువ కాకుండా తీసుకున్నప్పుడు 2 ముక్కలు తీసుకోవడం చాలా మంచిది. పొద్దున పూట తీసుకోవడం చాలా మంచిది.బొప్పాయి ఆకలి పుట్టిస్తుంది.చాలా వేడిచేస్తుంది కనుక పింపుల్ ఉన్నవారు ఎక్కువగా తినకూడదు.
బొప్పాయి పండును పేస్ట్ ల చేసి ముఖానికి మాస్క్ ల వేసుకోవడం వలన ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. జ్యూస్ గా తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. ఆడవాళ్లు పీరియడ్స్ టైమ్ లో తీసుకోవడం చాలా మంచిది. పీరియడ్స్ రాకున్నా బొప్పాయి తినడం వల్ల కరెక్టు టైమ్ కి వచ్చే అవకాశాలు ఎక్కువ. కంటిచూపు మందగించిన వారు ఎక్కువగా తరుచుగా తీసుకుంటూ ఉండటం వలన కంటి సమస్యలు తగ్గుతాయి. కిడ్నీ సమస్యలు రాకుండా ఉండటానికి మరియు ఉన్న సమస్యలను తొలగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది బొప్పాయి.
బొప్పాయి పండు తినడం వలన రక్త కణాలు పెరుగుతాయి. ఎ వయస్సు వారైనా బొప్పాయి తినవచ్చు. ఎదయన మితంగా తినడం చాలా మంచిది అందులో బొప్పాయి ఒకటి.బొప్పాయి తినడం వలన కేశాలు నలుపుగా ఉంటాయి. థైరాయిడ్ సమస్యలు కూడా రాకుండా చాలా వరకు తోడ్పతుంది. బొప్పాయి శరీరంలో కొవ్వు శాతం తగ్గిస్తుంది. ఇంకా ఇలాగా చాలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.